twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో

    By Bojja Kumar
    |

    రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమో మంగళవారం విడుదల చేశారు. 37 సెకండ్ల నిడివిగల ఈ ప్రోమో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ చరణ్ తన ఎర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు.

    ఈ పాట గురించి తన ఫేస్ బుక్ పేజీలో రామ్ చరణ్ పేర్కొంటూ... 'ఇప్పటి వరకు వచ్చిన తన సినిమాల్లో ఇదే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాట మీతో కూడా స్టెప్పులేయిస్తుంది' అన్నారు. రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు.

    ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరిగా చెవులు వినిపించని మెకానిక్ చిట్టిబాబు పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ సమంత చరణ్ లవ్ ఇంట్రెస్ట్ రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టన్ చేయబోతోంది.

    'రంగస్థలం' అనే గ్రామంలో జరిగే పరిణామాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో విలన్ ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు నటించారు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఐటం సాంగ్ మాస్ ప్రేక్షకులకు మంచి బూస్ట్ ఇవ్వనుంది. సుకుమార్ దర్శకత్వంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లిందని టాక్. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    The song teaser from Ram Charan's upcoming movie Rangasthalam was released Tuesday, March 20. The 37-second clip is high on energy. Ram Charan released the teaser by posting it on his Facebook account. He said Ranga Ranga Rangasthalaana is his best introduction song to date. "This is my favourite amongst all my intro songs thus far.... hope it makes u wanna dance!!! #DunguruDunguruDunguru #Rangasthalam. [sic]"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X