Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమో మంగళవారం విడుదల చేశారు. 37 సెకండ్ల నిడివిగల ఈ ప్రోమో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ చరణ్ తన ఎర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు.
ఈ పాట గురించి తన ఫేస్ బుక్ పేజీలో రామ్ చరణ్ పేర్కొంటూ... 'ఇప్పటి వరకు వచ్చిన తన సినిమాల్లో ఇదే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాట మీతో కూడా స్టెప్పులేయిస్తుంది' అన్నారు. రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరిగా చెవులు వినిపించని మెకానిక్ చిట్టిబాబు పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ సమంత చరణ్ లవ్ ఇంట్రెస్ట్ రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టన్ చేయబోతోంది.
'రంగస్థలం' అనే గ్రామంలో జరిగే పరిణామాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో విలన్ ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు నటించారు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఐటం సాంగ్ మాస్ ప్రేక్షకులకు మంచి బూస్ట్ ఇవ్వనుంది. సుకుమార్ దర్శకత్వంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లిందని టాక్. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.