twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్ట్రేలియా ఫిల్మ్ ఫెస్టివల్‌కు రంగస్థలం, మహానటి

    By Bojja Kumar
    |

    రామ్ చరణ్, సమంత, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఆది, అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రంగస్థలం' ఆస్ట్రేలియాలో జరుగనున్న 'ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2018' కోసం 'రంగస్థలం' ఎంపికైంది.

    ఆగస్టు 10 నుంచి 22 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'రంగస్థలం' ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడబోతోంది. ఈ మేరకు చిత్ర బృందానికి ఆహ్వానం అందింది. సినిమా ప్రదర్శన రోజు రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు సమాచారం.

    Rangasthalam

    పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకలు నీరాజనాలు పట్టారు. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన 'రంగస్థలం' రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

    ఇటీవల జరిగిన 100 రోజుల వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అనేది వన్ మ్యాన్ డ్రీమ్... ఆ వన్ మ్యాన్ సుకుమార్. ఆయన ఆలోచన, రైటింగ్ నుండే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అన్నారు.

    mahanati

    రంగస్థలంలో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ 'మహానటి' కూడా ఈ ఫిల్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ మూవీ కూడా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడబోతోంది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్ సావిత్రి పాత్రలో నటించారు.

    English summary
    The Indian Film Festival of Melbourne-2018, has announced its regional films list, with critically acclaimed films due for screening at the largest film festival in the Southern Hemisphere.Ram Charan’s ‘Rangasthalam’ has been selected as one of the Telugu films to be screened at IFFM this year. Similarly, Mahanati’ will also be screened at the Film Festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X