బుల్లితెరపై రాంచరణ్ సునామి.. రంగస్థలం కళ్ళు చెదిరే రికార్డ్!

Recommended Video

Rangasthalam Movie Highest TRP Rating

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చివరగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులని తిరగరాసింది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ 1980 కాలం నాటి కథతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే. చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తాజాగా రంగస్థలం చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది.

అదరగొట్టిన రంగస్థలం

అదరగొట్టిన రంగస్థలం

రంగస్థలం చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయింది. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తరువాత రెండవ అతిపెద్ద విజయంగా ఈ చిత్రం నిలిచింది. 200 కోట్లకు పైగా గ్రాస్, 120 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. సుకుమార్ దర్శకత్వం, కథని నడిపించిన విధానం, రాంచరణ్ నటనతో ఇంతటి ఘనవిజయం సాధ్యం అయింది.

బుల్లితెరపై సునామి

బుల్లితెరపై సునామి

రంగస్థలం చిత్ర రికార్డులు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ఈ చిత్రాన్ని బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రానికి అత్యధిక టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. 19.5 రంగస్థలం చిత్రానికి టిఆర్పి రేటింగ్ నమోదైంది.

 అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా

అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా


రంగస్థలం చిత్రంలో ప్రతి పాత్రని సుకుమార్ అద్భుతంగా మలిచారు. మాస్ ఆడియన్స్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడం విశేషం. రాంచరణ్ తో పాటు సమంత, జగపతి బాబు, ఆది పెనిసెట్టి, రంగమత్తగా అనసూయ అద్భుత నటన కనబరిచారు.

బోయపాటి సినిమాతో

బోయపాటి సినిమాతో


ప్రస్తుతం రాంచరణ్ బోయపాటి దర్శత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X