రంగస్థలం ప్రీరిలీజ్ లైవ్.. సుకుమార్ పిచ్చోడు.. శ్రీదేవికి అంకితం.. ఐటెం గర్ల్‌గా పూజా హెగ్డే

By Rajababu

'రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుకకు విశాఖ సాగర తీరం వేదికైమంది. ఆ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ అభిమానుల భారీగా హాజరుకావడంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. రంగస్థలం చిత్రంలో నటించిన నటీనటులతోపాటు, సాంకేతిక నిపుణులు వేదికను అలకరించారు. ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన వ్యాఖ్యాలతో అలరించారు. జానపద కళల, వివిధ కళారూపాలను వేదికపై ప్రదర్శించారు.

చంద్రబోస్ మాట్లాడుతూ..

చంద్రబోస్ మాట్లాడుతూ..

రంగస్థలం సినిమాలో గీత రచయిత చంద్రబోస్ సింగిల్ కార్డుతో ఐదు పాటలు రాశారు. తనకు సింగిల్ కార్డుతోపాటు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రాసే అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు సుకుమార్, దేవీ ప్రసాద్, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్

ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్

ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సుకుమార్ ఓ పిచ్చోడు. ఆయనకు సినిమా అంటే చాలా పిచ్చి. ప్రతీ నిమిషం సినిమా గురించే మాట్లాడుతారు. ఆలోచిస్తారు. అతనితో ఆర్య సినిమాతో మా ప్రయాణం ప్రారంభమైంది. రంగస్థలంలో యాక్షన్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది అని అన్నారు.

రాంచరణ్ అత్త అనసూయ

రాంచరణ్ అత్త అనసూయ

రంగస్థలం చిత్రంలో రంగమ్మ అత్త పాత్రను పోషించిన అనసూయ వేదికపై మాట్లాడుతూ.. రంగస్థలం ప్రీ రిలీజ్‌కు వచ్చిన అభిమానులను చూస్తే సాగరతీరంలో మరో జనసంద్రం ఉన్నట్టు కనిపించింది. రాంచరణ్‌కు అత్తగా నటించాను. చెర్రీ అత్త అని పిలువడం నాకు ఇష్టమనిపించలేదు. చెర్రీని నేను అల్లుడు పిలువను అని గొలపెట్టాను. కానీ పాత్రలోకి ఒదిగిపోయాక ఆ పాత్ర విలువేంటిందో తెలిసింది అని అన్నారు.

రంగస్థలం పాట శ్రీదేవికి

రంగస్థలం పాట శ్రీదేవికి

రంగస్థలంలోని ఎంత సక్కగున్నావే పాటను దివంగత అందాల తార శ్రీదేవికి అంకితమిచ్చారు. పాటను వేదిక మీద ప్లే చేసి శ్రీదేవి ఫోటోలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకొన్నది.

ఐటెం సాంగ్‌కు పూజా హెగ్డే డ్యాన్స్

ఐటెం సాంగ్‌కు పూజా హెగ్డే డ్యాన్స్

రంగస్థలంలోని ఐటమ్ సాంగ్‌ పాటకు వేదికపై పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులకు డ్యాన్సర్లు లయబద్దంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. పూజా హెగ్గే డ్యాన్సులకు మెగా ఫ్యాన్స్ ఈలలతో జోష్ పుట్టించారు.

పై లోకం నుంచి దీవిస్తుంటారు.. దేవీ శ్రీ ప్రసాద్

పై లోకం నుంచి దీవిస్తుంటారు.. దేవీ శ్రీ ప్రసాద్

రంగస్థలం సినిమా నాకు చేసే అవకాశం రావడం సుకుమార్ వల్లే. అందుకు సుకుమార్ థ్యాంక్స్. నాకు, ఆయనకు విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరిపోయింది. విలేజ్ వాతావరణాన్ని మా నాన్న సత్యానంద్ అందించిన ఆయనకు ధన్యవాదాలు. పై లోకాన్ని నుంచి మానాన్న, సుకుమార్ నాన్న మమల్ని దీవిస్తుంటారు. గ్రామీణ వాతావరణానికి తగినట్టుగా పాటలు చేయడంలో స్ఫూర్తి నందించిన ఇళయరాజాకు కూడా థ్యాంక్స్.

చిరంజీవికి స్వయంకృషి మాదిరిగా.. రాంచరణ్‌కు

చిరంజీవికి స్వయంకృషి మాదిరిగా.. రాంచరణ్‌కు

రామలక్ష్మీ పాత్ర లభించడం చాలా అదృష్టం. రాంచరణ్‌‌తో ఆర్టిస్టుగా స్వచ్చమైన ప్రయాణం ఈ సినిమా ద్వారా జరిగింది. చిరంజీవికి స్వయంకృష్టి ఎలా మంచి సినిమా అయిందో.. రంగస్థలం సినిమా రాంచరణ్‌కు అలా అవుతుంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సుకుమార్‌కు ధన్యవాదాలు.

ప్రత్యేక విమానంలో విశాఖకు

ప్రత్యేక విమానంలో విశాఖకు

ఈ వేడుకకు కోసం హాజరవుతున్న ముఖ్య అతిథి చిరంజీవితోపాటు రాంచరణ్, ఉపాసన, సమంత ప్రత్యేక విమానంలో ప్రత్యేక క్షణాలను విశాఖపట్నం చేరుకున్నారు.

ఉపాసన షేర్ చేసిన ఫొటోలు

ఉపాసన షేర్ చేసిన ఫొటోలు

చరణ్ సతీమణి ఉపాసన విమానంలోని ప్రత్యేక క్షణాలను షేర్ చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వస్తున్న క్రమంలో చరణ్‌కు తండ్రి చిరంజీవి స్వయంగా బర్గర్ తినిపించారు. తండ్రి చేత్తో అందించిన ఆ బర్గర్‌ను చరణ్ ఆస్వాదిస్తున్న ఫొటో మెగా అభిమానులను కట్టిపడేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X