twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలం ప్రీ రిలీజ్: సురేఖ వెక్కి వెక్కి ఏడ్చింది.. భావోద్వేగానికి గురయ్యా.. చిరంజీవి

    By Rajababu
    |

    'రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుకకు విశాఖ సాగర తీరం వేదికైమంది. ఆ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ అభిమానుల భారీగా హాజరుకావడంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. రంగస్థలం చిత్రంలో నటించిన నటీనటులతోపాటు, సాంకేతిక నిపుణులు వేదికను అలకరించారు. ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన వ్యాఖ్యాలతో అలరించారు. జానపద కళల, వివిధ కళారూపాలను వేదికపై ప్రదర్శించారు. రంగస్థలం సినిమాకు జాతీయ అవార్డులు రావడం ఖాయం అని చిరంజీవి అన్నారు.

    Recommended Video

    ఆమెతో ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది...!
    వైజాగ్‌లో అదే ఉత్సాహం

    వైజాగ్‌లో అదే ఉత్సాహం

    విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చిన ఎప్పుడో ఓ ఆనంద, ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడూ అదే మాట వినిపిస్తున్నది. సముద్రంతో పోటీ పడుతూ వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. రంగస్థలం సినిమా ప్రీరిలీజ్ వచ్చిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని చిరంజీవి అన్నారు.

    నా సినిమాలు గుర్తొస్తున్నాయ్

    నా సినిమాలు గుర్తొస్తున్నాయ్

    విశాఖతీరాన్ని చూస్తుంటే ఛాలెంజ్, అభిలాష, ఘరానా మొగుడు సినిమాలు గుర్తుకొచ్చేవి. ఆ సమయంలో పెద్ద స్టార్ కావాలనే కోరికతో ఉండేవాడిని. నా కెరీర్‌లో వైజాగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వైజాగ్ ప్రజలది మంచి మనుసులు. ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు అని మెగాస్టార్ పేర్కొన్నారు. రంగస్థలం వేడుక రంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

    నిర్మాతలకు అభినందనలు

    నిర్మాతలకు అభినందనలు

    రంగస్థలం లాంటి ఓ ప్రత్యేకమైన సినిమాను రూపొందించిన మైత్రీ మూవీస్ అధినేతలకు ప్రత్యేక అభినందనలు. వాళ్లు కేవలం మూడు సినిమాలు చేసినా గొప్ప అనుభవం ఉన్న నిర్మాతలుగా వ్యవహరించారని రాంచరణ్ చెప్పేవాడు. రంగస్థలం వారికి హ్యాట్రిక్ సాధించిపెడుతుంది.

    సుకుమార్‌కే అగ్రతాంబూలం

    సుకుమార్‌కే అగ్రతాంబూలం

    రంగస్థలం సినిమాకు సంబంధించిన అగ్రతాంబూలం దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుంది. చాలా స్వచ్చమైన వాతావరణం ప్రతిబింబించే సినిమా. పల్లెటూరు మనస్తత్వాన్ని చాటిచెప్పే, ఉద్వేగాన్ని రేకేత్తిస్తుంది. 30 తేదీన మీరు చూసిన తర్వాత మీరే చెబుతారు.

    ఖైదీ లాంటి సినిమా

    ఖైదీ లాంటి సినిమా

    నాకు ఖైదీ క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో.. అలా రంగస్థలం రాంచరణ్‌కు అంత క్రేజ్ తెచ్చిపెడుతుంది. రంగస్థలం సినిమా రాంచరణ్‌కు రావడం కొంత ఈర్షగా ఉంది. తండ్రిగా నాకు గర్వంగా ఉంది. పాటలను చాలా నాటుతనంతో, సహజంగా చిత్రీకరించారు. పల్లె వాతావరణాన్ని చిత్రీకరించిన విధానం గుండెను పిండేస్తుంది.

    సుకుమార్ మీద అనుమానం

    సుకుమార్ మీద అనుమానం

    లోకల్ పాలిటిక్స్ ఉంటాయని రంగస్థలం కథ చెప్పినప్పుడు సుకుమార్ వెల్లడించారు. కానీ ఎలా తీస్తాడో అనే అనుమానం ఉండేది. హీరోకు చెవుడు ఉంటుందంటే భయపడ్డాను. సినిమా తీసిన తర్వాత చూస్తే సుకుమార్ అద్బుతంగా తీశాడు.

    తెలంగాణ బిడ్డ అయినా.. గోదావరి

    తెలంగాణ బిడ్డ అయినా.. గోదావరి

    దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన బాణీలు సమకూర్చాడు. తక్కువ సమయంలో అన్నిపాటలు రూపొందించడం వారి అకింతభావానికి నిదర్శనం. తక్కువ సమయంలో చంద్రబోస్ రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. చంద్రబోస్ తెలంగాణ బిడ్డ అయినప్పటికీ.. గోదావరి జిల్లాలోని పదాలు పట్టుకొన్న తీరు ఆయన ప్రతిభకు తార్కాణం. గొప్ప పాటలు రాసిన నీ పెన్నుకు వెన్ను వంచి నమస్కరిస్తున్నాను.

    రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్

    రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్

    రంగస్థలం సినిమాకు రత్నవేలు అద్బుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. రోబో, ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫరేనా అనే అనుమానం కలుగుతుంది. జూబ్లీహిల్స్ లాంటి పోష్ ఏరియాలో సెట్ వేసిన రామకృష్ణకు, ఆయన సతీమణికి ధన్యవాదాలు. ఓ గ్రామాన్ని తీర్చిదిద్దిన తీరు చూస్తే ఆయన గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ అనిపించింది.

    సురేఖ వెక్కి వెక్కి ఏడ్చింది..

    సురేఖ వెక్కి వెక్కి ఏడ్చింది..

    రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను, సురేఖ భావోద్వేగానికి గురయ్యాం. సురేఖ అయితే వెక్కి వెక్కి ఏడ్చింది. రాంచరణ్ నటన చూసి గర్వపడింది. సినిమా చూసిన తర్వాత సుకుమార్‌తో దాదాపు అర్ధగంట సేపు మాట్లాడుకొన్నాను.

    రాంచరణ్ ఎమోషన్స్ గుండెలో

    రాంచరణ్ ఎమోషన్స్ గుండెలో

    రాంచరణ్ ఎమోషన్స్ గుండెలో పెట్టుకొని నటించడం వల్లనే తెర మీద అద్భుతంగా కనిపిస్తాడు. సమంత అద్భుతంగా నటించింది. పల్లెటూరు యువతిగా సూపర్బ్ కనిపించింది. అనసూయ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కూడా పాత్రలు కూడా బాగుంటాయి. అన్నివిభాగాలకు అవార్డుల వస్తాయి. జాతీయ అవార్డు కూడా రావడం ఖాయం.

    English summary
    Director Sukumar took the opportunity to take the audience back to the 80s with Rangasthalam 1985. This film features Ram Charan, Samantha Akkineni, Aadhi Pinisetty, Anasuya Bharadwaj and Jagapati Babu in the lead roles. Ram Charan will be seen essaying the role of Chitti Babu in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X