రంగస్థలం అమ్మా, నాన్న గర్వపడే సినిమా.. అప్పుడు దిగులుపడ్డాను.. ప్రీరిలీజ్‌లో రాంచరణ్
Recommended Video

రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి విశాఖ సాగరతీరం వేదికైంది. ఈ కార్యక్రమం కోసం భారీగా మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంచరణ్, ఉపాసన, సమంత, అనసూయ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. రంగస్థలంలోని ఎంత సక్కగున్నావే పాటను దివంగత అందాల తార శ్రీదేవికి అంకితమిచ్చారు. పాటను వేదిక మీద ప్లే చేసి శ్రీదేవి ఫోటోలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకొన్నది. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..

మెగాఫ్యాన్స్‌తో ఉగాది రోజున
ఉగాది పండుగ రోజు మెగా ఫ్యాన్స్ అనే కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ అధినేతలకు ధన్యవాదాలు. గ్రామంలో ఉండే గొడవలు ఎలా ఉంటాయో అలాంటివి వాటికి రాంలక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

మా తాతగారు పనిచేసేటప్పుడు
గ్రామీణ ప్రాంతంలో పెరగలేదనే బాధ పోయింది. చిన్నప్పుడు మా తాత గారు నెల్లూరులో పనిచేసేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లాను. ఆ తర్వాత ఆపద్భాంధవుడు సినిమా షూటింగ్ సమయంలో ఊరు వాతావరణాన్ని చూశాను. ఇప్పుడు రంగస్థలం ద్వారా మళ్లీ గ్రామీణ ప్రాంతాన్ని చూసే అవకాశం కలిగింది.

సమంతతో పనిచేయడం
సమంతతో పనిచేయడం ఓ ఎనర్జీ ఇస్తుంది. సమంత నటించిన సినిమాల్లో చూస్తే హీరోలకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పక్కన నటించిన బాబాయ్ పవన్ కల్యాణ్ చూస్తే ఆమె ప్రతిభ తెలుస్తుంది.

చంద్రబోస్ పాటలు హైలెట్
చంద్రబోస్ రాసిన పాటలు ఈ సినిమా హైలైట్. ఓ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ చాలా ఆహ్లాదంగా రాసిన చంద్రబోస్ గారికి ధన్యవాదాలు. చంద్రబోస్ రాసిన పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, సంగీతాన్ని ఇచ్చారు.

సుకుమార్ దిగులుపడ్డాను..
సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్‌ను రోజు చూసే అవకాశం ఉండదు అనే దిగులు పట్టుకొన్నది. మా అమ్మా, నాన్న గర్వపడే సినిమాను సుకుమార్ అందించారు. ప్రతీ క్షణం సుకుమార్ నా నుంచి మంచి నటనను రాబట్టుకోవడానికి చూసేవారు.

మెగాస్టార్ చిరంజీవి గర్వపడుతారు..
రంగస్థలం సినిమాకు ముందు మెగాస్టార్ చిరంజీవికి రాంచరణ్ కొడుకుగా పుట్టడం గర్వం అనేవారు. కానీ రంగస్థలం సినిమా చూసిన తర్వాత రాంచరణ్ తమ కొడుకుగా పుట్టడం గర్వమని చిరంజీవి, సురేఖగారు చెప్పుకొంటారు అని నటుడు బ్రహ్మజీ అన్నారు.


Click it and Unblock the Notifications











