‘రంగస్థలం’ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ అదుర్స్, సెకండాఫ్ కాస్త లాగారు...క్లైమాక్స్ అద్భుతం!
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైతి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షోలు పడగా, యూఎస్ఏలో కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా చూసిన పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమాకు అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ప్యూర్ మాస్టర్ క్లాస్
‘రంగస్థలం' ఒక అద్భుతమైన సినిమా. దర్శకుడు సుకుమార్ ఎంతో జీనియస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదు. రంగస్థలం గురించి చెప్పాలంటే ప్యూర్ మాస్టర్ క్లాస్ అంటూ... ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కన్నుల పండుగే, కానీ సెకండాఫ్ సాగదీశారు
రంగస్థలం సినిమా లవర్స్‌కు కన్నులపండగలా ఉంటుంది. రామ్ చరణ్ తన యాక్టింగుతో కట్టిపడేశారు. సుకుమార్ జీనియర్ డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్లు అనిపించింది... అని మరో అభిమాని తెలిపారు.
ఫస్టాఫ్ అదుర్స్
సినిమా ఫస్టాఫ్ అదిరిపోయింది. ఇలాంటి అమేజింగ్ విజువల్స్ నేను ఇప్పటి వరక చూడలేదు. రామ్ చరణ్ రియల్ పెర్ఫార్మర్. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోలా నడిచింది. నేను 5/5 రేటింగ్ ఇస్తాను.... అంటూ మరొకరు వెల్లడించారు.
ఒక్క క్షణం కూడా వేస్ట్ అనిపించదు
సినిమా మూడు గంటల పాటు నడుస్తుంది. కానీ మీకు ఒక్క క్షణం కూడా వేస్ట్ అనిపించదు. అద్భుతమైన డ్రామా, అద్భుతమైన క్యారెక్టర్లు.... అనే కొందరు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
రామ్ చరణ్ సూపర్
రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సినిమా సెకండాఫ్ ఎంతో కీలకం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డిఎస్పీ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్సయింది. ట్విస్టులు థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంది. రంగస్థలం అద్భుతమైన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ.... అనే టాక్ వినిపిస్తోంది.
ఓవరాల్ గుడ్ మూవీ
రంగస్థలం ఫస్టాఫ్ బావుంది, సెకండాఫ్ కాస్త లాగినట్లు ఉంది. ఎండింగ్ బావుంది. ఓవరాల్ గుడ్ మూవీ. చరణ్ పెర్ఫార్మెన్స్ బావుంది.
కెరీర్ బెస్ట్ పెర్పార్మెన్స్
రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. కామెడీ టైమింగ్, ఎమోషన్స్, డైలాగ్ డెలివరీ అన్నా బావున్నాయి.
ఏ డైరెక్టర్ నీలోని యాక్టర్‌ను వాడుకోలేదు
ఇన్ని రోజులు ఏ డైరెక్టర్ కూడా రామ్ చరణ్ లోని యాక్టర్‌ను వాడుకోలేదు. సుకుమార్ అద్భుతంగా వాడారు అంటూ ఓ అభిమాని అభిప్రాయ పడ్డారు.
ఎమోషనల్‌గా ఫీలవుతారు
రంగస్థలం చిత్రం మిమ్మల్ని ఎమోషనల్‌గా ఫీలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా హ్యూమన్ వ్యాల్యూస్ అద్భుతంగా చూపించారు. అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రులతో, ఇరుగు పొరుగువారితో అనుబంధం గురించి బాగా చూపించారు... అని ఓ అభిమాని అభిప్రాయ పడ్డారు.
ఆ 20 నిమిషాలు కేక
సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు అద్భుతం.... అంటు కొందరు ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











