»   » రంగస్థలం టీజర్ : సమంతని అణువణువూ వర్ణించిన రాంచరణ్!

రంగస్థలం టీజర్ : సమంతని అణువణువూ వర్ణించిన రాంచరణ్!

Subscribe to Filmibeat Telugu
రంగస్థలం టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజాగా చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ తనలోని నటనకు పదును పెట్టి చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పల్లె టూరి చిట్టి బాబుగా అలరించనున్నాడు. చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తుండడంతో రంగస్థలంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రంగస్థలం చిత్ర టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితమే సమంత పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ దాదాపు 30 సెకండ్ల నిడివి గల టీజర్ ని విడుదల చేసింది.

 గడసరి పల్లెటూరి పిల్లగా

గడసరి పల్లెటూరి పిల్లగా

సమంత ఈ చిత్రంలో గడసరి పల్లెటూరి పిల్లగా నటిస్తోంది. అచ్చ తెలుగు పల్లెటూరి యువతి 1985 కాలంలో ఎలా ఉంటుందో సమంత అలా తన పాత్రలో ఒదిగిపోయింది. సుకుమార్ చిత్రీకరించిన లొకేషన్స్ ఓ ఎత్తైతే, సమంత పెర్ఫామెన్స్ టీజర్లో మరో ఎత్తుగా నిలిచింది.

 అణువణువూ వర్ణించిన చిట్టిబాబు

అణువణువూ వర్ణించిన చిట్టిబాబు

ఈ టీజర్ సమంత పలుకులు ఏవీ వినిపించలేదు. సమంత స్క్రీన్ పై కనిపిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో రాంచరణ్ వాయిస్ ఓవర్ వస్తూఉంది. సమంత గురించి చరణ్ వర్ణన టీజర్ కు హై లైట్ గా నిలిచింది.

 సమంత పేరుని అందంగా చెప్పిన చిట్టిబాబు

సమంత పేరుని అందంగా చెప్పిన చిట్టిబాబు

టీజర్ లో రాంచరణ్ వాయిస్ ఓవర్ తో వస్తున్న డైలాగులు అదిరిపోయాయి. తన ప్రియురాలు గురించి చిట్టి బాబు వర్ణన అద్భుతంగా ఉంది. 'ఓహోహో..ఏం వయ్యారం ఏం వయ్యారం.. ఏమాటకామాట సెప్పుకోవాలండి.. ఈ పిల్ల ఎదురొత్తుంటే మా ఊరికే 18 ఏళ్ల వయసు వచేసినట్లుంటుంది. ఈ చిట్టిగాడి గుండెని గోలేట్టిచ్చేసింది ఈ పిల్లేనండి. పేరు.. రామలక్ష్మి అండి. ఊరు.. అని చరణ్ అంటుండగా రంగా రంగస్థలాన అంటూ నేపధ్యగీతం వస్తుంది.

అంచనాలు ఆకాశాన్ని తాకడం..

ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాడు. రాంచరణ్ లుక్ ఈ చిత్రంలో సరికొత్తగా ఉంటూ అభిమానులని అబ్బురపరిచింది. ఇక టీజర్ అయితే ఒకరేంజ్ లో ఆకట్టుకోవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. తాజాగా సమంత పాత్రని పరిచయం చేస్తూ విడుదలైన టీజర్ అగ్నికి వాయువు తోడైనట్లుగా అంచనాలు పెంచేసింది. ఫిబ్రవరి 13 న ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేయనున్నారు.

English summary
Rangasthalam movie Samantha character introducing teaser released. Samantha looks and Ramcharan voice over is major highlight in the teaser
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu