నందిగామలో మధ్యలో నిలిచిపోయిన రంగస్థలం చిత్రం..ఉద్రిక్త పరిస్థితి!

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం ఉండడంతో తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి.

 Rangasthalam movie show stops in Nandigama

ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా నందిగామలో మయూరి థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పరిమితికి మించిన ధరలతో రంగస్థలం చిత్ర టికెట్స్ ని విక్రయిస్తోందని ఫిర్యాదు కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో థియేటర్ కు వెళ్లారు. తనిఖీ పేరుతో రంగస్థలం చిత్ర ప్రదర్శనాని మధ్యలో ఆపివేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X