ఉత్కంఠ రేపుతున్న రంగస్థలం కథ..సుకుమార్ చేస్తోంది పెద్ద ప్రయోగమే!

Recommended Video

ఉత్కంఠ రేపుతున్న రంగస్థలం

ఈ వేసవికి రానున్న చిత్రాలలో ముందుగా అడుగుపెట్టే భారీ చిత్రం రంగస్థలం. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టర్ కూడా చేయనటువంటి ప్రయోగాన్ని సుకుమార్ చేయబోతున్నారు. 1985 కాలం నాటి పరిస్థితులని సుకుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. తాజాగా లీకైనా ఈ చిత్ర కథ వివరాలు అత్యంత ఉత్కంఠగా మారాయి. ఈ చిత్రంలో అసలు కథ రాజకీయం అని వార్తలు వస్తున్నాయి.

 పేదింటి పిల్లగా సమంత

పేదింటి పిల్లగా సమంత

సమంత ఈ చిత్రంలో పేదింటి పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో సమంత లుక్స్ అదిరిపోయాయి. ఇక ఆమె నటన ఎలా ఉండబోతోంది అనే దాని కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు

రామ్ చరణ్ కు ఈ పాత్ర ఓ సవాలే. టీజర్ లో చూస్తే చరణ్ తన పాత్రలో ఒదిగిపోయాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక చిట్టిబాబుగా చరణ్ చేయబోయే సందడి గురించే అంతా చర్చించుకుంటున్నారు.

 రాజకీయ నేపథ్యం

రాజకీయ నేపథ్యం

టీజర్ లో చూపిన విధంగా రామ్ చరణ్ పాత్ర సరదాగా సాగుతుంది. కానీ అసలు విషయాన్ని సుకుమార్ దాచిపెట్టేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్ర కథ రాజకీయ నేపథ్యంతో కూడుకున్నదనే విషయం తెలియగానే అంతా షాక్ కి గురవుతున్నారు.

పెద్ద ప్రయోగమే

పెద్ద ప్రయోగమే

1985 నాటి పరిస్థితులు, పైగా అప్పటి రాజకీయాలు.. ఈ తరహా కథని ఎంచుకోవడం కత్తి మీద సామే. రంగస్థలం చిత్రంతో సుకుమార్ పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడని సినివర్గాలు చర్చించుకుంటున్నాయి.

మండల స్థాయి ఎన్నికలు

మండల స్థాయి ఎన్నికలు

రంగస్థలం చిత్రంలో మండలస్థాయి ఎన్నికలకు సంబందించిన సన్నివేశాలు ఉన్నాయట. ఈ సన్నివేశాలని సుకుమార్ తనదైన శైలిలో చిత్రీకరించి రక్తి కట్టించబోతున్నట్లు తెలుస్తోంది. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుకు, ఈ ఎన్నికలు సుకుమార్ ఎలా లింకు పెట్టాడనే డౌటు ఉత్కంఠని రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X