రాంచరణ్ 'రంగస్థలం' మెరుపులే ఇక.. వైజాగ్ లో అలా, హైదరాబాద్ లో మరోలా.. !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. దాదాపుగా రంగస్థలం పూర్తి కావడంతో చరణ్ ప్రస్తుతం వైఫ్ తో కలసి ఫారెన్ టూర్ లో ఉన్నాడు. తిరిగి రాగానే రంగస్థలం సందడి షురూ కానుంది. వీలైనంత త్వరగా చిత్ర యూనిట్ రంగస్థలం ఆడియోవేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టీజర్, మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ హీట్ ని మరింత పెంచేలా ఘనంగా ఆడియో, ప్రీరిలీజ్ వేడుకల్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో ఆడియో వేడుక, హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాడనికి కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.

Recommended Video

Rangasthalam Will Open The Summer Season
ఫారెన్ లో చరణ్

ఫారెన్ లో చరణ్

రంగస్థలం చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో చరణ్ తన వైఫ్ ఉపాసనతో కలసి ఫారెన్ టూర్ వెళ్ళాడు. తిరిగి రాగానే రంగస్థలం చిత్రం ప్రమోషన్లో పాల్గొంటాడు.

చిట్టి బాబు కోసం వైటింగ్

చిట్టి బాబు కోసం వైటింగ్

రాంచరణ్ రంగస్థలం చిత్రంలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా అలరించనున్నాడు. చిట్టి బాబు పాత్రలో చరణ్ నటన చోడడానికి అభిమానులు మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

చరణ్ జోడిగా సమంత అదుర్స్

చరణ్ జోడిగా సమంత అదుర్స్

ఈ చిత్రంలో సమంత చరణ్ కు జోడిగా నటిస్తోంది. సమంత పోషిస్తున్న రామలక్ష్మి పాత్ర కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరణ్, సమంత జోడి పల్లెటూరి జంటగా ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.

 వైజాగ్ వేదికగా

వైజాగ్ వేదికగా

ఈ చిత్ర ఆడియో వేడుకని వైజాగ్ నగరంలో నిర్వహించడానికి కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. వైజాగ్ లో మెగా హీరోల చిత్రాలకు ఎప్పుడూ అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. దీనితో వైజాగ్ లో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో మరొకటి

హైదరాబాద్ లో మరొకటి

చిత్ర విడుదలకు కొద్ది రోజుల ముందు నిర్వహించే ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహిచానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు ఈవెంట్లని భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా సినిమాపై మరింతగా అంచనాలు పెంచొచ్చనేది మేకర్స్ ప్లాన్.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ప్రపంచ వ్యాప్తంగా విడుదల

అన్ని కార్యక్రమాల్ని పక్కాగా ప్లాన్ చేసి చిత్రాన్ని మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X