పవన్ కల్యాణ్ కోసం రాంచరణ్ త్యాగం.. మెగా ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సుకుమార్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన మొదలుపెట్టారో గానీ రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నది. తొలుత దసరా అనుకొన్నట్టు వార్తలు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సుకుమార్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన మొదలుపెట్టారో గానీ రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నది. తొలుత దసరా అనుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీపావళీ అని అన్నారు..
సంక్రాంతికి వస్తుందేమో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు రాంచరణ్ నిరాశే మిగిల్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం వేసవి సెలవుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది.

రంగస్థలం రిలీజ్ వాయిదా
రంగస్థలం సినిమా రిలీజ్ వాయిదా వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా గ్రాఫిక్ వర్క్ ఈ సినిమాకు అడ్డంకిగా మారిందట. బాహుబలి తర్వాత గ్రాఫిక్స్ ఇంపార్టెన్స్, స్టాండర్డ్స్ పెరగడంతో ప్రతీ చిత్రంలో కూడా అదే స్థాయిని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

పిరియాడిక్ ఫిలిం కావడంతో
రంగస్థలం పిరియాడిక్ ఫిలిం కావడంతో గ్రాఫిక్స్ చాలా ఇంపార్టెన్స్ పెరిగిందట. బాహుబలి స్థాయిలో గ్రాఫిక్స్‌ను చిత్రంలో జొప్పిస్తున్నారట. అందుకే సినిమా వాయిదా ల మీద వాయిదా పడుతున్నట్టు ఫిలింనగర్ సమాచారం.

పవన్ కల్యాణ్ 25వ చిత్రాన్ని
ఇది ఇలా ఉండగా, పవన్ కల్యాణ్ 25వ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉంచేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం దసరా బరి నుంచి సంక్రాంతి బరిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో రంగస్థలం కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

పోటాపోటిగా మెగా హీరోల
అయితే ఒకేసారి మెగా హీరోల చిత్రాలు పోటాపోటిగా రిలీజ్ చేస్తే కష్టమనే భావనకు వచ్చారట. సో బాబాయ్ పవన్ కోసం అబ్బాయి రాంచరణ్ రాజీ పడి తన చిత్రాన్ని వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

సైరా నర్సింహరెడ్డి చిత్ర నిర్మాణంపై
ఇక రంగస్థలం చిత్రంలో నటిస్తూనే రాంచరణ్ తండ్రి చిరంజీవి నటించబోయే సైరా నర్సింహరెడ్డి చిత్ర నిర్మాణంపై దృష్టిపెట్టాడు. కొణిదెల బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను తన సతీమణి ఉపాసనకు రాంచరణ్ అప్పగించినట్టు తెలుస్తున్నది.

ప్రత్యేకమైన పాటలో పూజా హెగ్డే
రంగస్థలం చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్నది. ఈ చిత్రంలో సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, తదితరులు నటిస్తున్నారు. ఇక అందాల తార పూజా హెగ్డే ఓ ప్రత్యేకమైన పాటలో మెరువనున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











