రంగస్థలం నిర్మాతల సంచలన నిర్ణయం.. చిట్టిబాబు మ్యాజిక్, అదే ఊపులో అక్కడ కూడా!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. రంగస్థలం చిత్రం రాంచరణ్, సుకుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తిరుగులేని నిర్మాణ సంస్థగా మైత్రి మూవీస్ మరో మారు నిరూపించుకుంది. వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడిగా ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ పాత్రలో రాంచరణ్ నటించాడు. రామలక్ష్మి పాత్రలో సమంత మెప్పించింది. జగపతి బాబు, ఆది పినిశెట్టి కూడా అద్భుత నటన కనబరిచారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ రంగస్థలం చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త వెల్లడించారు.

కళ్ళు చెదిరే రికార్డు
రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బాహుబలి తరువాత టాలీవుడ్ లో ఇదే రికార్డు. రాంచరణ్ నటనతో, సుకుమార్ పక్కా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు.

సంచలనం నిర్ణయం
ఈ మధ్య కాలంలో భారతీయ చిత్రాలు చైనాలో వరుసగా విడుదలవుతూ అక్కడ కూడా విజయాన్ని అందుకుంటున్నాయి. బలమైన కథ, కథనం రంగస్థలం చిత్రంలో ఉండడంతో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయబోతున్నారు.

ఘనవిజయం సాధించిన చిత్రాలన్నీ
బాహుబలి, దంగల్ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలన్నీ చైనాలో విడుదలవుతున్నాయి. అదే బాటలో రంగస్థలం చిత్రం కూడా పయనించనుంది.

అన్ని భాషల్లోకి
అదే విధంగా ఇండియాలోని ప్రముఖ భాషలలోకి కూడా ఈ చిత్రాన్ని అనువదించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











