ఎండల్లోనే "రంగస్థలం": నిర్ణయం తీసేసుకున్నారట
ఒక్కొక్క అడుగే వెనక్కి వేసుకుంటూ వెళ్ళి మొత్తానికి సమ్మర్ రిలీజ్ అని ఫిక్సయ్యింది రంగస్థలం. ముందే అనుకున్నట్టు సంక్రాంతికి వద్దామనుకుంటే ఆ సమయానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా అఙ్ఞాత వాసి
ఒక్కొక్క అడుగే వెనక్కి వేసుకుంటూ వెళ్ళి మొత్తానికి సమ్మర్ రిలీజ్ అని ఫిక్సయ్యింది రంగస్థలం. ముందే అనుకున్నట్టు సంక్రాంతికి వద్దామనుకుంటే ఆ సమయానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా అఙ్ఞాత వాసి వచ్చి అడ్డం పడింది. పోనీ ఏప్రిల్లో డేట్ చూసుకుందామని అనుకుంటే రోబో 2.0 కూడా అప్పుడే రావాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయ్, అంతే కాదు తెలుగులో కూడా భారీ సినిమాలు అదే సమయం లో రానున్నాయి కాబట్టి ఆ టైమ్ కూడా సేఫ్ కాదు.
Recommended Video


ఏప్రిల్ లో వద్దు అనుకుంటే
పోనీ ఏప్రిల్ లో వద్దు అనుకుంటే ఇక అప్పటికే చాలా సమయం అయిపోతుంది. సినిమా రెడీ చేసి పెట్టి రిలీజ్ చెయ్యకుండా అలా ఉంచటం కూడా కరెక్ట్ కాదు కదా. అలా అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకే ‘రంగస్థలం' టీమ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మార్చి 29న విడుదల
ఈ చిత్రాన్ని వేసవి సీజన్ ఆరంభంలోనే రిలీజ్ చేసేయాలని ఫిక్సయినట్లు సమాచారం. మార్చి 29న సినిమాను విడుదల చేసేందుకు ముహూర్తం చూసుకున్నట్లు తెలుస్తోంది.మామూలుగా వేసవిలో మార్చి నెలాఖరుకే సినిమాల సందడి మొదలైపోతుంది.

మార్చి నెలాఖరు అయితే
ఆ నెలాఖరుకే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫ్రీ అయిపోతుంటారు. ఏప్రిల్లో ఎలాగూ తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి మార్చి నెలాఖరు అయితే సోలో బ్యాటింగ్‌కు దిగొచ్చని భావిస్తోంది ‘రంగస్థలం' టీం. సంక్రాంతికే అనుకున్న సినిమాను మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే నిర్మాతలకు ఫైనాన్స్ వడ్డీలు తడిసిమోపెడవుతాయి.

ఇబ్బంది లేదు
మార్చి 29కి ఫిక్సయితే.. ఒకవేళ ఏప్రిల్ 13న ‘2.0' వచ్చినా ఇబ్బంది లేదు. రెండు వారాల పాటు మంచి రన్ ఉంటే సినిమా లాభాల బాట పట్టేస్తుంది. కాబట్టి ఈ డేటుకే ‘రంగస్థలం' దాదాపుగా ఫిక్సయినట్లే అంటున్నాయి చిత్ర వర్గాలు. ఆ విధంగా సమ్మర్ ఓపెనింగ్ సినిమాగా రావటానికి సిద్దమైపోయింది రంగ స్థలం.


Click it and Unblock the Notifications











