యూఎస్ఏలో ‘రంగస్థలం’ సక్సెస్ మీట్?

By Bojja Kumar

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సూపర్ సక్సెస్‌తో దూసుకెలుతోంది. సినిమా విడుదలైన తొలి వారాంతంలోనే రూ. 100 కోట్ల మార్కను అందుకుని అద్భుతమైన వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం.. అటు యూఎస్ఏలోనూ 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇక్కడ ఈ చిత్రం ఈజీగా 3 మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా.

సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ ఏప్రిల్ 14న యూఎస్ఏ వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో అమెరికాలో సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.

యూఎస్ఏలో ఈ చిత్రం అద్భుతంగా రన్ అవుతుండటంతో అక్కడి ప్రేక్షకులకు ధన్యవాదలు చెప్పడంలో భాగంగా ఈ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది అనే విషయమై క్లారిటీ లేదు.

Rangasthalam Success Meet In USA?

రామ్ చరణ్ కెరీర్లోనే యూఎస్ఏలో అత్యధికంగా 194 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం తొలి వీకెండ్ పూర్తయ్యే నాటికి $1,939,890 వసూళ్లు నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే చెర్రీ గత చిత్రం 'ధృవ' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ప్రీమియర్ షోల ద్వారా గురువారం $706,612, శుక్రవారం $588,165, శనివారం $645,114 , ఆదివారం $426,685 వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. సోమవారం $109,000 వసూలు చేసింది. దీంతో టోటల్ గ్రాస్ $2,479,213 నమోదైంది.

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 5వ రోజు(మంగళవారం) కలెక్షన్లతో కలుపుకుని ఓవరాల్ వసూళ్లు $2,571,213 రీచ్ అయింది. త్వరలోనే ఈ చిత్రం శ్రీమంతుడు ($2,891,000) రికార్డును అధిగమిస్తుందని, లైఫ్‌టైమ్ రన్‌లో 3 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X