ఆ మూడూ సీన్లు ఉంటే జనాలు నన్ను కొట్టేవారు: రంగస్థలం వేడుకలో అజయ్ ఘోష్

By Bojja Kumar

Recommended Video

Rangasthalam Succes Meet : Actor Ajay Ghosh Sensational Speech

రంగస్థలం చిత్రంలో నటుడు అజయ్ ఘోష్.... విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ చేసే అన్యాయాలకు వంతపాడుతూ, రంగస్థలం గ్రామ ప్రజలను హింసించే పాత్రలో క్రూరమైన పాత్రలో అతడు నటించారు. సినిమాలో చిట్టిబాబు అతన్ని కొడుకుంటే థియేటర్లో చప్పట్లే చప్పట్లు. రంగస్థలం విజయోత్సవంలో ఆయన్ను వేదిక మీదకు పిలిచిన యాంకర్ సుమ ఈ విషయాలను గుర్తు చేశారు.

ఫోటో గ్యాలరీ: రంగస్థలం విజయోత్సవ సంబరాలు

 ఆ మూడు సీన్లు ఉంటే జనాలు నన్ను కొట్టేవారు

ఆ మూడు సీన్లు ఉంటే జనాలు నన్ను కొట్టేవారు

ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ.... నా మీద ఇంకో మూడు సీన్లు కూడా చిత్రీకరించారు. ఆ మూడు సీన్లు కూడా సినిమాలో ఉంటే బయట కనపడితే జనాలు నన్ను కొట్టేవారు. అంత అద్భుతంగా సుకుమార్ గారు ఆ సీన్లు తీశారు... అని తెలిపారు.

గుండెను తడి చేసే సినిమా

గుండెను తడి చేసే సినిమా

రంగస్థలం విజయం మీ(ప్రేక్షకులు) విజయం, ఎన్ని హైఫై సినిమాలు వచ్చినా గుండెను తడిచేసే సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని నిరూపించిన మీది అని అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు.

ఇది మిస్సయితే జీవితంలో చాలా మిస్సయ్యేవాడిని

ఇది మిస్సయితే జీవితంలో చాలా మిస్సయ్యేవాడిని

ఇలాంటి కథను ఎంచుకోవడం ద్వారా మన మూలాలను వెత్తుక్కునే విధంగా దర్శకుడు సుకుమార్ చేశారు. ఆయన లెక్కల మాస్టారు, ఆయన ప్రతి లెక్కకు ఒక లెక్కఉంటుంది. ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇది మిస్సయితే నా జీవితంలో చాలా మిస్పయ్యేవాడిని. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను... అని అజయ్ ఘోష్ తెలిపారు.

చిరంజీవిగా తన కొడుకు గురించి గొప్పగా

చిరంజీవిగా తన కొడుకు గురించి గొప్పగా

ఇవన్నీ ఒక పక్క అయితే ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ ఒక మాట అన్నారు. చిరంజీవిగారి కడుపున చరణ్ గారు పుట్టడం చరణ్ గారి అదృష్టం అంటారు. కానీ ఈ సినిమా ద్వారా చిరంజీవిగారు తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకునేలా చరణ్ చేశాడు.... అని అజయ్ ఘోష్ తెలిపారు.

సినిమాను ప్రేమించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి

సినిమాను ప్రేమించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి

ఒక నిర్మాత బ్రతికితే ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి అన్నం దొరుకుతుంది. మైత్రి మూవీ మేకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను ప్రేమించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. కళాకారులను గౌరవించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. టెక్నీషియన్స్‌ను గౌరవించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. వారు అందరికీ రూపాయి ఒక కళగా ఇచ్చారు, కమ్మటి బువ్వ పెట్టారు. ఎంతో గౌరవించారు, ప్రేమించారు, అందరం కష్టపడ్డాం, అందుకే ఈ రోజు సినిమా ఎక్కడో ఉంది. ఈ విజయంలో మేము కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది... అని అజయ్ ఘోష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X