రేంజ్ రోవర్ వోగ్ కారుని గిప్ట్ గా అందుకున్న మహేష్ బాబు
మహేష్ బాబు తన పుట్టిన రోజు (ఆగస్టు 9)కానుకగా రేంజ్ రోవర్ వోగ్ కారుని గిప్ట్ గా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసి అందరికీ తెలియపరిచారు. ఇంతకీ పదిరోజుల ముందుగానే కోటి రూపాయల పైగా ఖరీదు చేసే ఖరీదైన గిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ అనుకుంటున్నారా...మరెవరో కాదు..నమ్రత. మహేష్ బాబు ప్రేమించి పెళ్లాడిన భార్య.ఇక ప్రస్తుతం మహేష్ ..ఖలేజా రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాడు. త్వరలోనే ఆడియో పంక్షన్ ఉండనుంది. అలాగే భారీ ఎత్తున సినిమాని ప్రమోట్ చెయ్యటానికి వివిధ కంపెనీలతో టైఅప్ అయి ప్రోమోలు తయారు చేస్తున్నారు. అనూష్క హీరోయిన్ చేసిన ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మహేష్ చిత్రం కావటంతో మంచి క్రేజే వచ్చింది. ఇక పుట్టిన రోజున ఖలేజా చిత్రం పబ్లిసిటీ మెటీరియల్ విడుదల చేస్తున్నారు.
మహేష్ బాబు అనుష్క ఖలేజా రేంజ్ రోవర్ వోగ్ ఆగస్టు 9 mahesh babu anushka khaleja namratha trivikram range rover vogue


Click it and Unblock the Notifications