Just In
- 16 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 26 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కంగన రనౌత్ నుంచి కోటి రూపాయలు కొట్టేశాడట.. టాప్ యాక్టర్‌పై కేసు
బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి, హీరోయిన్ కంగన రనౌత్ మధ్య వివాదం రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, కోర్టులో ఫిర్యాదు నమోదు చేయడం మీడియాలో ప్రముఖంగా మారింది. ఇటీవల పరువు నష్టం కేసులో కంగనను, ఆమె సోదరి రంగోలి చండేల్‌ను కోర్టుకు ఆదిత్య దంపతులు లాగడం తెలిసిందే. దానికి బదులుగా ఆదిత్యపై తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం గురించి మరింతగా..

కంగన సిస్టర్స్‌పై పరువు నష్టం దావా
ఇటీవల పరువు నష్టం దావా కేసులో కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలికి ఆదిత్య పంచోలి ఫిర్యాదుతో కోర్టు నోటీసులు పంపింది. గతంలో తన సోదరి కంగనను లైంగికంగా వేధించాడు. గృహనిర్బంధం చేశాడు. రేప్ కూడా చేశాడు. దానికి రుజులు మేము ఇవ్వలేం అంటూ రంగోలి ట్వీట్ల వర్షం కురిపించడంతో ఆదిత్య దంపతులు షాక్ తిన్నారు. దాంతో వారిపై పరువు నష్టం దావా వేశారు.

నా సోదరి నుంచి రూ.1 కోటి
ఆదిత్య పంపిన నోటీసులకు ప్రతీకారంగా రంగోలి ఆదిత్యపై దారుణమైన ఆరోపణలు చేసింది. కంగనకు ముంబైలో ఇళ్లు లేనప్పుడు ఆశ్రయం కల్పించాడు. మూడు నెలలు భోజనం పెట్టినందుకు వేధించాడు. నా సోదరిని బెదిరించి, ఆమె నుంచి 2007లో కోటి రూపాయలకుపైగా కొట్టేశాడు. అందుకు సంబంధించిన కొన్ని రుజువులను జత చేస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆదిత్య పంచోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆదిత్య పంచోలిపై ట్వీట్ల వార్స్
కాగా ఆదిత్య పంచోలిని టార్గెట్ చేసుకొని రంగోలి చండేల్ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆదిత్య మీద ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. 2007లో కంగనపై దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోటికి పైగా డబ్బు తీసుకొని.. ఇంకా కావాలని వేధించాడు. దానికి సంబంధించి ఆదిత్య పంపిన మెసేజ్ నా వద్ద ఉంది అని రంగోలి ఓ ట్వీట్ చేసింది.

కంగన బిజీ.. అందుకే నేను
తనపై వస్తున్న ఆరోపణలను, దాడులపై సమాధానం ఇవ్వడానికి కంగనకు సమయం లేదు. ఆమె తరఫున అన్ని వ్యవహారాలను తాను చూసుకొంటున్నానని, దానికి ఆమెకు చాలా మనోధైర్యాన్ని కూడగడుతున్నాను. కంగన షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఆమె తరఫున కేసులను ఫైల్ చేయాల్సి వస్తున్నది అని కంగన రనౌత్ వెల్లడించింది.