హృతిక్ సొదరికి నరకం... ఆమెను హింసిస్తున్నారు.. ప్రాణ హాని కూడా ఉంది!
బాలీవుడ్‌లో క్రేజీ హీరో, హీరోయిన్లు హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ప్రతీసారి ఓ కొత్త అంశం వీరి వివాదంలో కీలకమైన పాయింట్‌గా మారుతున్నది. హృతిక్ సోదరి సునైనా రోషన్ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. హృతిక్ కుటుంబం సునైనా గృహబంధం చేశారనే ఆరోపణలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఈ వివాదంలో తలదూర్చడం మరింత ఆసక్తిగా మారింది. అసలు ఈ వివాదం ఏమిటంటే..

హృతిక్, కంగన రనౌత్ మధ్య కొత్త వివాదం
హృతిక్, కంగన మధ్య కొత్త వివాదానికి కారణం సునైనా రోషన్ చేసిన ట్వీట్. నేను నరకంలో జీవిస్తున్నాను. నరకాన్ని అనుభవించడంతో జీవితం మీద విసుగుపుడుతున్నది. ఎప్పుడు కంగనకు నా మద్దతు ఉంటుంది అని సునైనా అని ట్వీట్ చేసింది. హృతిక్‌తో విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలో కంగనపేరును కుటుంబ వివాదంలోకి లాగడం మరింత రచ్చ చేసింది. దాంతో రంగేలి ఈ వివాదంలో తలదూర్చింది.

కుటుంబంలో సఖ్యత
ప్రతీ ఇంటిలో సోదరి, సోదరుల మధ్య సఖ్యత ఉండటం కష్టం. నాకు, కంగనకు హృతిక్ రోషన్ సోదరి కాల్ చేస్తున్నది. సహాయం కావాలని మెసేజ్ చేస్తున్నది. గతంలో హృతిక్ విషయంలో ఆమెతో నేను సరిగా వ్యవహరించలేదు. అందుకు క్షమాపణ చెబుతున్నాను అంటూ రంగేలి వరుస ట్వీట్లు చేసి సంచలనం రేపింది.

ముస్లిం యువకుడితో ప్రేమలో సునైనా రోషన్
సునైనా ఢిల్లీకి చెందిన ముస్లిం యువకుడితో ప్రేమలో ఉన్నది. అందుకే ఆమెను తన కుటుంబం శారీరకంగా హింసిస్తున్నది. అందుకే ఆమె కంగన సహయం కోసం ఆర్థిస్తున్నది. సునైనాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్‌తో కొట్టించారు. స్వయంగా ఆమె తండ్రి కూడా కొట్టారు. సునైనా సోదరుడు హృతిక్ ఆమెను గృహ నిర్భందం చేశారు. ఆమె ప్రాణాలకు ఏదైనా ముప్పు కలుగుతుందేమోననే భయం వెంటాడుతున్నది అని రంగేలి అనుమానాలు వ్యక్తం చేసింది.

సునైనా వ్యవహారం అందరికి చెప్పాలని
అందుకే సునైనా వ్యవహారాన్ని పబ్లిక్‌కు తెలియజేయాలని అనుకొంటున్నాం. ఆమెకు ఎలా సహాయం చేయాలో కంగనకు తెలియడం లేదు. సునైనా సెఫ్టీ కోసం, భద్రత కోసం ఆమె నంబర్‌ను కంగన బ్లాక్ చేసింది. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ప్రేమ విషయంలో మొండిగా ఉండటమే రోషన్ కుటుంబాన్ని ఇబ్బందిల్లో పడేసిందనుకొంటా. ఆమె నిర్బంధం నుంచి బయటపడుతుందని అనుకొంటాను అని రంగేలి సందేహం వ్యక్తం చేసింది.

సునైనా ఎప్పటీకి నా ఫ్రెండే
ఇటీవల కంగన రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. సునైనాతోనూ, ఆమె కుటుంబంతోనూ నాకు మంచి స్నేహం ఉందనే విషయం అక్షరాల సత్యం. కానీ ఇప్పుడు వారు మాట మార్చారు. సునైనా నాతో ఇప్పటికీ టచ్‌లో ఉంది. ఆమె కుటుంబ వివాదాన్నిఅనుకూలంగా మలుచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికీ సునైనా నాకు ఫ్రెండే. ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని కంగన వెల్లడించింది.


Click it and Unblock the Notifications











