twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ పేరుతో టార్చర్.... హీరో రాజ్ తరుణ్ కష్టాలు చూశారా?

    By Bojja Kumar
    |

    టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగిన యువ నటుడు రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలోనే 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్ ఈ సంక్రాంతికి 'రంగుల రాట్నం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

    ఆసక్తి రేపుతున్న ట్రైలర్

    ఆసక్తి రేపుతున్న ట్రైలర్

    ‘రంగుల రాట్నం' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. లవ్ స్టోరీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

    అమ్మాయికి సైట్ కొట్టమని చెప్పే తల్లి

    అమ్మాయికి సైట్ కొట్టమని చెప్పే తల్లి

    ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తల్లి పాత్రలో సితార నటిస్తోంది. కొడుకును వెళ్లి అమ్మాయికి సైట్ కొట్టు అని ఆమె చెప్పడం ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి సినిమాలో తల్లి, కొడుకుల బంధాన్ని ఎంత ఫ్రెండ్లీగా చూపించబోతున్నారో స్పష్టమవుతోంది.

    హీరోయిన్‌గా చిత్ర శుక్లా

    హీరోయిన్‌గా చిత్ర శుక్లా

    ఈ చిత్రంలో చిత్ర శుక్ల హీరోయిన్ గా నటిస్తోంది. చూడ్డానికి ఎంతో క్యూట్‌గా రాజ్ తరుణ్‌కు తగిన జోడీలా ఉంది. మా ఇంట్లో వన్ మదర్, ఓన్లీ సన్, వన్ ఓన్ హౌస్, వన్ ఓన్ కంపెనీ, ఫార్టీ థౌజండ్ మంత్లీ ఇన్ కం, ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ టెక్సెస్ అంటూ.... హీరోయిన్ కు తనను తాను హీరో పరిచయం చేసుకునే సీన్ ఆకట్టుకుంది.

    ప్రేమ పేరుతో టార్చర్

    ప్రేమ పేరుతో టార్చర్

    హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ హీరో.... ప్రేమ పేరుతో ఆమె పెట్టే టార్చర్ భరించలేని పరిస్థితికి వస్తాడు. ఆమెను దూరం చూసుకుంటాడు. అయితే చివరకు ఆ టార్చరే నాకు కావాలి అని రియలైజ్ అయి ఆమె ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ డ్రామాను తెరపై ఎంతో అందంగా చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది.

    అన్నపూర్ణ స్టూడియోస్

    అన్నపూర్ణ స్టూడియోస్

    2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది.

    శ్రీరంజని దర్శకత్వం

    శ్రీరంజని దర్శకత్వం

    రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది. ఫైనల్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్ళీ రాజ్‌ తరుణ్‌తో చేసిన చిత్రం 'రంగుల రాట్నం'.

    ప్రధాన తారాగణం, తెర వెనక

    ప్రధాన తారాగణం, తెర వెనక

    రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎల్‌.కె.విజయ్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: పురుషోత్తం ఎం., నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, దర్శకత్వం: శ్రీరంజని.

    ట్రైలర్ ఇదే...

    రంగుల రాట్నం ట్రైలర్ ఇదే... ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.

    English summary
    Rangula Ratnam Movie Theatrical Trailer starring #RajTarun, #ChitraShukla. Written & Directed by #Shreeranjani, Music Composed By #SricharanPakala, Produced by Annapurna Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X