»   »  రాణి ముఖర్జీకి పండంటి కూతురు జన్మించింది, పేరు ఏమిటంటే...

రాణి ముఖర్జీకి పండంటి కూతురు జన్మించింది, పేరు ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరై రాణి ముఖర్జీ నిర్మాత ఆధిత్య చోప్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజుల్లెనే ఆమె గర్భం దాల్చింది. తాజాగా పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

నేను అంకుల్ అయ్యాను. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణి ముఖర్జీ, ఆదిత్యా దంపతులకు ఆడబిడ్డ పుట్టిందని అతడు ట్విట్టర్ లో ప్రకటించాడు. పాపకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ఆదిరా' అనే పేరును కూడా వారు పెట్టేశారు. ఆదిరా జననంతో ఆదిత్య, రాణి ముఖ్యర్జీల కుటుంబం ఎంతో ఆనందంలో మునిగి తేలుతోంది.

ధూమ్-3 చిత్ర నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా....హీరోయిన్ రాణీ ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంత కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2014 ఏప్రిల్ 21న వీరు హడావుడి, భారీ ఆర్బాటాలు లేకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు.

ఆదిత్య చోప్రాకు రాణిముఖర్జీతో రెండో వివాహం. గతంలో ఆయన పాయల్ ఖన్నాను పెళ్లాడారు. అయితే 2009లో ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా...రాణిముఖర్జీకి దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ...సహజీవనం వరకు వెళ్లింది. పెళ్లికి ముందు నుండే వీరు కలిసి ఉంటున్నారు. తర్వాత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

హ్యాపీ మమ్మీ రాణి

హ్యాపీ మమ్మీ రాణి

డిసెంబర్ 9, 2015న ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణి ముఖర్జీ పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.

భారీ భద్రత

భారీ భద్రత

రాణి ముఖర్జీ ప్రసవం సందర్భంగా బీచ్ క్యాండీ ఆసుపత్రిలో భారీ భద్రత ఏర్పాటు చేసారు.

పేరు ఆదిరా

పేరు ఆదిరా

పాపకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ఆదిరా' అనే పేరును కూడా వారు పెట్టేశారు. ఆదిరా జననంతో ఆదిత్య, రాణి ముఖ్యర్జీల కుటుంబం ఎంతో ఆనందంలో మునిగి తేలుతోంది.

రాణి, ఆదిత్య

రాణి, ఆదిత్య

2014 ఏప్రిల్ 21న వీరు హడావుడి, భారీ ఆర్బాటాలు లేకుండా రాణి, ఆదిత్య రహస్యంగా వివాహం చేసుకున్నారు.

రాణి

రాణి

రాణి ముఖర్జీకి బాలీవుడ్ సెలబ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు.

English summary
Rani Mukerji and Aditya Chopra have been blessed with a baby girl today on December 9, 2015. The bundle of joy, Rani's daughter, was born at Breach Candy Hospital in Mumbai. Parineeti Chopra, took to Twitter and congratulated the couple by saying, "ITS A GIRL !!!! So so excited baby Adira is born !
Please Wait while comments are loading...