హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్లో విషాదం
ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా రామ్ ముఖర్జీ పలు హిందీ, బెంగాళీ సినిమాలకు పని చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి, ప్రముఖ ఫిల్మ్ మేకర్ రామ్ ముఖర్జీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ ముఖర్జీ ఆదివారం తెల్లవారుఝామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
దర్శకుడిగా, నిర్మాతగా, స్కీన్ రైటర్ గా రామ్ ముఖర్జీ అనేక హిందీ సినిమాలకు, బెంగాళీ సినిమాలకు పని చేశారు. ముంబైలోనే ఈరోజు ఆయన అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ ఏడాది బాలీవుడ్ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది. వినోద్ ఖన్నా, ఓంపురి, కుందన్ షా, లేఖ్ టండన్ పాటు ఇపుడు రామ్ ముఖర్జీ కూడా కన్నుమూయడంతో బాలీవుడ్ విషాదంలో మునిగి పోయింది.


Click it and Unblock the Notifications











