»   » అప్పుడు బరితెగించి ఇప్పడు బాధపడుతున్న హీరోయిన్

అప్పుడు బరితెగించి ఇప్పడు బాధపడుతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్య ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో అందరూ చూస్తుండగానే లిప్ కిస్ పెట్టుకుని అప్పట్లో పెద్ద చర్చకే తెరలేపారు బాలీవుడ్ హాట్ లేడీస్ రాణి ముఖర్జీ, విద్యా బాలన్. ఆ సమయంలోనే విద్య, రాణీ అనుబంధంపై రకరకాల కథనాలు కూడా మీడియాలో వెలువడ్డాయి. ఆ కథనాలకు సపోర్టు ఇచ్చే విధంగా విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్" పోస్టర్‌ను తెగ పొగిడేసి మళ్లీ లేనిపోని అనుమానాలకు అవకాశం కల్పిస్తుంది రాణి. ఇటీవల విడుదలైన 'డర్టీ పిక్చర్" పోస్టర్లు చూసిన రాణి అవి చాలాసెక్సీగా ఉన్నాయి. ఆ పోస్టర్‌లో హాట్ గా కనిపిస్తున్న విద్యాబాలన్‌ని చూస్తే ఆడదాన్ని నాకే ఏదోలా అయిపోతోంది" అని రాణీ వ్యాఖ్యానించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇద్దరి మద్య 'సం"బంధం ముదురుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి

అయితే..తను ఏం మాట్లాడినా తప్పుగా తీసుకోవడంపై రాణి ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొన్నటివరకూ హీరోలతోనో, దర్శకులతోనో, నిర్మాతలతోనో మాకు అక్రమ సంబంధాలను అంటగట్టేవారు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌కీ హీరోయిన్‌కీ మధ్య స్వలింగ సంపర్కులు అంటూ సంబంధంకట్టేస్తున్నారు. ఇలాంటి అసత్యపు పుకార్ల వల్ల సాటి ఆడదానితో మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ తన మనసులోని బాధను వెల్లగక్కింది. ఇలాంటి వాటి వల్ల తన పరువు పోతోందని, నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నాననే విధంగా ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే...రాణి అలా బాధ పడటంపై కొందరు సెటైర్లు విసురుతున్నారు. గతంలో పబ్లిక్ గా బరితెగించి, ఇద్దరూ ముద్దు పెట్టకున్నప్పుడు లేని బాధ...ఇప్పడెందుకు అని దెప్పి పొడుస్తున్నారు.

English summary
Rani mukherjee feel sad about rumors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu