కలిసి రాణి ఇల్లు
రాణి ముఖర్జీకి కొత్త ఇల్లు కలిసి రాలేదట. నిన్న మొన్నటి వరకు రాణి ముంబయిలోని యార్లీ వీధిలోని కళ్యాణ్ కాంప్లెక్స్‌లో వుండేవారు. ఇటీవలే జుహు ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలున్న బంగ్లాను కొనుగోలు చేశారు ఆమె. ఎంతో ఇష్టంగా ఆ బంగ్లాలో అడుగుపెట్టిన ఆమెకు మళ్ళీ పాత గూటి మీదకే మనసు మళ్ళింది. ఆ ఇంట్లోకే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు ఆమె.
తను నటిస్తున్న తాజా చిత్రం 'దిల్ బోలే హడిప్ప' విడుదల రోజే తన పాత ఇంట్లోకి మారబోతున్నారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణుల సలహా మేరకే రాణి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా రాణీముఖర్జి ప్లాఫ్‌లతో సతమమవుతున్నారు. కళ్యాణ్ కాంప్లెక్స్‌లోని భవంతిలో వున్నప్పుడు తన కెరీర్‌లో సక్సెస్‌లు వున్నాయని, కొత్త ఇంట్లోకి వచ్చిన తరువాతే తనకు ప్లాఫ్‌లు వస్తున్నాయన్న నమ్మకంతో వున్నారు రాణి. ఇక ఇందుకోసం తన పాత ఇంట్లో అద్దెకు వుంటున్న కుటుంబాన్ని కూడా రాణి వెంటనే ఖాళీ చేయమని చెప్పారట. ఇక రాణిముఖర్జికి మళ్ళీ పాత ఇల్లు కలిసివస్తుందో లేదో..వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











