నిర్మాతతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా చోప్రాకు, స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీకి మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ ఉమ్మడిగానూ,విడి విడిగానూ వీటిని ఖండిస్తూనే వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ సీక్రెట్ హ్యాలిడే ట్రిప్ పూర్తి చేసుకుని వస్తూ బాలివుడ్ మీడియా కళ్లళ్లో పడ్డారు. ఓ మీడియా వ్యక్తి ఓ ఫోటోను క్లిక్ మనిపించి ఆమెను కోపం తెప్పించాడు. న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ని వీరిద్దరూ ఫారిన్ లో జరుపుకున్నారని,అందుకే వీరిద్దరూ కలిసి వస్తున్నారని వారు వార్తలు రాసేసారు. అయితే ఈ వార్త ఎయిర్ పోర్ట్ అధారిటీ ద్వారానే బయిటకు వచ్చిందని, వారిపై ఆమె చాలా సీరియస్ అయ్యిందని చెప్తున్నారు.
ఇక రాణి ముఖర్జీ ఈ విషయమై స్పందిస్తూ..ఇలాంటి వాటికి తాను సమాధానం చెప్పాల్సిన పని లేదని,అయినా తమ ప్రైవసీకి ఎవరు భంగం కలిగించినా ఊరుకునేదిలేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇక రాణి,ఆదిత్యా చోప్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మరో వార్త వినపడుతోంది. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో వేచి చూడాలి. ఇక పెళ్లి విషయంలో ఆమె మాట్లాడుతూ... తాను తల్లిదండ్రులకు ఒకతే కూతురు అని, పెళ్లి చేసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఆమె చెప్పింది. ఊహాగానాలకు సమాధానం చెప్పి సమయం వృధా చేసుకునే బదులు తాను తన చిత్రాలపై దృష్టి పెడతానని ఆమె అన్నది.


Click it and Unblock the Notifications











