భర్తకు శాపనార్థాలు, తిట్లు.... ఇదీ హీరోయిన్ రాణి ముఖర్జీ వ్యవహారం!
Recommended Video

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాణి ముఖర్జీ నాలుగేళ్ల క్రితం 'మర్దాని' చిత్రం చేశారు. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాతో పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె తాజాగా 'హిచ్కి' అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె టోరెట్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే టీచర్ పాత్రలో నటిస్తోంది.
రాణి ముఖర్జీ ఇటీవల నేహా దూపియా హోస్ట్ చేస్తున్న చాట్ షో 'వోగ్ బిఎఫ్ఎఫ్ఎస్'లో తన ఫ్రెండ్ సభ్యాసాచితో కలిసి పాల్గొన్నారు. ఈ షోలో రాణి ముఖర్జీ తన భర్త ఆదిత్య చోప్రా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆదిత్య చోప్రాను రాణి తొలిసారి అలా కలిశారు
‘నేను నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత లక్కీగా ‘ముఝే దోస్తీ కరోగీ' అనే సినిమా చేశాను. ఆ సమయంలో ఆదిత్యను తొలిసారి ప్రొఫెషనల్‌గా కలిశాను' అని రాణి ముఖర్జీ తెలిపారు.

నాతో మొహం మీదే చెప్పారు
‘నేను వరుసగా చెత్త సినిమాలు చేయడంతో నన్ను తీసుకోవద్దని చాలా మంది ప్రెషర్ తెస్తున్నారని, నన్ను తీసుకోవడం యశ్ రాజ్ ఫిలింస్‌కు అంత మంచిది కాదని... పలువురు ఆదిత్యకు సూచించారని, ఆ విషయాన్ని ఆదిత్య నాతో మొహం మీదే చెప్పారు' అని రాణి ముఖర్జీ గుర్తు చేశారు.

నాపై నమ్మకం పెట్టారు
‘కానీ ఆదిత్య నా టాలెంటు మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన తీస్తున్న సినిమాలో నేను అయితేనే సరిగ్గా సరిపోతాను అని నమ్మారు. అసలు విషయాన్ని ఆయన మొహం మీదే చెప్పేయడం నాకు చాలా నచ్చింది' అని రాణి ముఖర్జీ తెలిపారు.

నా భర్తకు శాపనార్థాలు పెడతా, తిడతాను
మీ భర్తతో గొడవ పడతారా? అనే ప్రశ్నకు రాణి స్పందిస్తూ.... అవును, ప్రతి రోజూ మేము గొడవ పడతాం. ప్రతిసారి ఆయనకు శాపనార్థాలు పెడుతూనే ఉంటాను. నాకు నచ్చని పని చేసినప్పుడల్లా తిడుతూనే ఉంటాను. కానీ ఆయన ప్రేమ పూర్వకమైన పనులతో నన్ను మెప్పిస్తూ ఉంటారు... అని రాణి ముఖర్జీ తెలిపారు.

మా ఫ్యామిలీలో తిట్టుకుంటాం..
మా ఫ్యామిలీలో మేము తిట్టుకుంటాం, ప్రేమతో తిట్టుకుంటాం... ద్వేషంతో కాదు. నేను ఎవరినైనా తిడుతున్నానంటే అతడిపై నాకు నిజంగా ప్రేమ ఉన్నట్లు అర్థం అని రాణి ముఖర్జీ తెలిపారు.

ఆదిత్యకు కెమెరా ముందుకు రావడం సిగ్గు...
ఆదిత్యకు కెమెరాల ముందుకు రావడం, మీడియాలో హాట్ టాపిక్ కావడం పెద్దగా ఇష్టం ఉండదు. ‘దేవుడు నీతో ప్రేమలో పడేలా చేసిన తర్వాత...నేను ఒక నటితో ప్రేమలో ఉన్నాను అనే విషయాన్ని ఆలోచించకుండా ఉండేలేక పోతున్నాను అని పెళ్లి తర్వాత ఆది చెప్పారు. అందుకు కారణం మీడియా వారే.... అని రాణి ముఖర్జీ తెలిపారు.

కూతురు గురించి
‘నా కూతురు అదిరా సెలబ్రిటీ కిడ్ మాదిరిగా కాకుండా నార్మల్ కిడ్‌లా పెంచాలనుకుంటున్నాను. మీడియా అటెన్షన్ ఆమెపై పడటం ఇష్టం లేదు. స్కూల్లో ఇతర పిల్లలానే నా కూతురు అందరూ నార్మల్‌గా ట్రీట్ చేయాలని కోరుతున్నాను. అందుకే మేము ఎప్పుడూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు.... అని రాణి ముఖర్జీ తెలిపారు.


Click it and Unblock the Notifications











