మాది మగాళ్ల సినిమా: రామ్ గోపాల్ వర్మ
'రణ్' - మగాళ్ల సినిమా అని రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేశారు. అంటే ఆడవాళ్ళు చూడకూడదా..మగాళ్ళ కోసమే తీసారా అని అంటే అదేమీ కాదట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలన్నీ మగాళ్ళే చేసారని సమాధానమిస్తున్నారాయన. చిత్రంలోని మిగతా ఆడవాళ్లందరూ సహాయ పాత్రల్లో కనిపిస్తారని చెప్తున్నారు. అందుకే అలా అనాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే ఈ చిత్రంలోని పాత్రల గురించి చెపుతూ..అమితాబ్ బచ్చన్ పాత్ర సినిమాకు ఆయువుపట్టులాంటిదని రితేశ్ దేశ్‌ముఖ్, సుదీప్, పరేష్ రావల్, రజత్ కపూర్ లాంటి వాళ్లు పోషించిన పాత్రలు కూడా కథకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇక ఆడవాళ్ళయిన నీతూచంద్ర, గుల్ పనాగ్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరుల పాత్రలు కథను నడిపించడానికి అవసరమయ్యే సహాయపాత్రలని అన్నారు. రైమా సేన్ స్థానంలో నీతూ చంద్రను తీసుకున్నారు. ఈమె సుదీప్ సరసన నటించింది. అమితాబ్ తోనూ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. శీతల్ వినోద్, మధు మంతెన నిర్మించిన 'రణ్'ను జనవరి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న రక్త చరిత్ర షూటింగ్ సెకెండ్ షెడ్యూల్ 22 నుంచి రెగ్యులర్ గా జరగనుంది. మరో ప్రక్క ఆయన త్రీడి చిత్రం రక్ష స్క్రిప్టుని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











