twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అత్తారింటికి దారేది రీమేక్ : కరెంటు షాక్‌తో అభిమాని మృతి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని సుదీప్ హీరోగా కన్నడలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘రన్న' పేరతో ఈ చిత్రం జూన్ 4న విడుదలైంది. కర్నాటకలో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సుదీప్ కు ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు బ్యానర్లు కడుతూ, థియేటర్లను డెకరేట్ చేస్తుండగా రాయప్ప అభిమాని కరెంట్ షాక్ తో మరణించారు.

    ఈ విషాద సంఘటనపై సుదీప్ సంతాపం వ్యక్తం చేసారు. రాయప్ప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్లు చేసారు. నేను మీ అందరి అభిమాని సంపాదించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మీరు నాకు ఎంతో ముఖ్యం. బ్యానర్లు ముఖ్యం కాదు. నాకు కావాల్సింది బ్యానర్లు కాదు..మీరు కావాలి. ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి అని సుదీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

    Ranna Tragedy, Sudeep fan died due to electric shock

    కాగా.... తెలుగులో అత్తారింటికి దారేది భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి రీమేక్ అయిన ‘రన్న' చిత్రం కూడా కర్నాటకలో సూపర్ హిట్ అయింది. సినిమా విడుదలైన మార్నింగ్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమాకు సుదీప్ అభిమానులు, కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

    ఈ చిత్రాన్ని కన్నడలో 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై నిర్మించారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కన్నడ వెర్షన్ నంద కిషోర్ డైరక్ట్ చేసారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటించింది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించింది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటించింది. అత్త పాత్రలో మధుబాల నటించింది.

    English summary
    Sudeep's fans are enjoying blockbuster movie Ranna, which has released all over Karnataka. But, as per the latest reports from Gandhinagara, a fan of Abhinaya Chakravarthy has died due to electric shock while passing through the procession.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X