థియేటర్లో ఆ హీరోతో దొరికిపోయిన దీపిక పదుకోన్

By Bojja Kumar

హైదరాబాద్: అప్పట్లో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం జరిపిన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్....కొంత కాలం తర్వాత అతనితో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమ్మడు రణవీర్‌సింగ్‌తో ప్రేమలో పడింది. రామ్ లీలా చిత్రం తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత పెరిగింది.

ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉండబట్టే ఆ సినిమాలో ఇద్దరూ రొమాంటిక్ సీన్లు సహజంగా పండించగలిగారనే వాదన కూడా ఉంది. ఆ సినిమా తర్వాత నుండి ఇద్దరూ ప్రేమలోకంలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బయటికి మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ బుకాయిస్తున్నారు. తమ ప్రేమ వ్యవహారంపై ఈ జంట ఇప్పటివరకు పెదవి విప్పలేదు.

Ranveer, Deepika caught in a movie theatre together

ఇలాంటి విషయాలు దాచడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఈ ఇద్దరి ప్రేమాయణం విషయంలోనూ అదే జరిగింది. ముంబై శివారు ప్రాంతంలోని ఓ థియేటర్‌లో రహస్యంగా సినిమా చూడటానికి వచ్చిన ఈ జంట మీడియాకు దొరికిపోయారు. ‘గాన్ గర్ల్' అనే సినిమా చూడటానికి వచ్చి దొరికి పోయారు.

ఇద్దరూ సినిమా థియేటర్‌కు వేర్వేరు కార్లలో చేరుకున్నారు. థియేటర్లో కలుసుకున్నారు. తర్వాత మీడియా కంట పడటంతో ఇద్దరూ ఖంగుతిన్నారు. అక్కడి నుండి వెంటనే జారుకున్నారు. అయితే వీరు వచ్చిన విషయం మీడియాకు ఎలా లీకైంది అనేది హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X