ఇక్కడ రామ్ చరణ్... అక్కడ రణవీర్
రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ లవ్ స్టోరీ 'మగధీర' సినిమా భారీ విజయం సాధించి, అనేక అవార్డులు సొంతం చేసుకుని తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి వరకు మెగాస్టార్ కొడుకుగానే ఉన్న రామ్ చరణ్, ఈ సినిమాతో స్టార్ హీరో హోదా సొంతం చేసుకున్నాడు.
తాజాగా ఈ సినిమా హిందీలోనూ రీమేక్ కాబోతోంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మాదిరే...తెలుగు సక్సెస్ సినిమాలపై కన్నేసిన యువ హీరో రణవీర్ సింగ్ ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో మలుపు తిప్పే సినిమా నిలుస్తుందని రణవీర్ ఆశలు పెట్టుకున్నాడు.
అనురాగ్ కశ్యప్, వికాస్ బాహికి చెందిన Phantom సినిమా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అప్పట్లో తెలుగులో ఈ చిత్రం నిర్మించడానికి దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటి ఖర్చులో తీయాలంటే రూ. 60 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు?, హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ ఎవరనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











