»   » 23 లిప్ లాక్ సీన్లు :హాలీవుడ్ సినిమా కాదు మనదే

23 లిప్ లాక్ సీన్లు :హాలీవుడ్ సినిమా కాదు మనదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఒకప్పుడు ఇమాన్ హష్మి ఉండేవాడు కాని ఇప్పుడు ఆ టైటిల్ ను క్రేజీ స్టార్ రణ వీర్ సింగ్ కు ఇచ్చేయొచ్చు అనిపిస్తుంది. ఏ సినిమా చేసినా సరే అందులో హీరోయిన్ ను ముద్దులతో ముంచెత్తడడమే ప్రస్తుతం బాలీవుడ్ హవా. హీరో రణవీర్ ఇప్పుడు మరో భామతో ముద్దులాట మొదలు పెట్టాడు.

బాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత ఆదిత్య చోప్రా తన తండ్రి 83వ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బేఫికర్' (దోజ్ హు డేర్ టు లవ్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, వాణి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు

బాలీవుడ్ చిత్రం ''బేఫికర్'' లిప్‌లాక్‌ల పరంగా గత రికార్డులన్నింటిని చెరిపివేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్ని ముద్దు సీన్లు ఉంటే అది ఖచ్చితంగా అడల్ట్ మూవీ రేంజిలొ ఉంటుందని అందరూ అనుకోవడం సహజం, కానీ ఇది ''దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే" లాంటి అద్బుతమైన ప్రేమ కథ ని అందించిన దర్శకుడు తీస్తున్న సినిమా.

Ranveer Singh and Vaani Kapoor to kiss 23 times in 'Befikre'

అయితే ఈ సీన్లేవీ కావాలని ఇరికించినవి కాదనీ. కథలో తప్పనిసరి కాబట్టే ఈ ముద్దు సీన్లు ఉంటాయని అంటున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లిప్‌లాక్ దృశ్యంతోనే ఇటీవలే విడుదల చేశారు.

ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇదివరలో మల్లికా షెరావత్ ''ఖ్వాయిష్'' చిత్రమే అత్యధిక లిప్‌లాక్‌లు కలిగిన సినిమా అనిపించుకుంది. కానీ ఇప్పుడు ఆదిత్య చోప్రా ''బేఫికర్'' చిత్రం ఆ రికార్డును సైతం తిరగరాసింది. .

English summary
Reports say Ranveer and Vaani will be seen kissing each other as many as 23 times in the movie 'Befikre'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu