»   » వీడియో: రూ. 750 డొనేట్ చేయమంటూ యంగ్ హీరో

వీడియో: రూ. 750 డొనేట్ చేయమంటూ యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోలు ఎంత సేపూ తమ సినిమాలు, తమ యాడ్స్ అన్నట్లు బ్రతుకుతూంటారు. అంతేతప్ప బయిట జనం,వారి కష్ట, సుఖాలు వారికి అనవసరం. తెరపై చూపే కష్టాలను తెరపైనే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు కానీ...బయిట వాటికి సంభందినన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఉత్సాహం చూపించరు. అయితే బాలీవుడ్లో మెయిన్ స్ట్రీమ్ యాక్టర్, యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్ వీరికి భిన్నంగా ఉన్నారు. అక్షయపాత్ర అనే ఓ ఎన్ జి వో ఆర్గనైజేషన్ కోసం ఆయన 750 రూపాయలు డొనేట్ చేయమని అడుగుతూ యాడ్ చేసారు. ఆ యాడ్ ని మీరు ఈ క్రింద చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అక్షయపాత్ర మిడ్ డే మీల్ పోగ్రామ్ పేరుతో సాగే ఈ ఆర్గనైజేషన్ ..దేశంలోని పదివేల స్కూల్లలో పిల్లలకు భోజనాలు పెట్టేందుకు విరాళాలు సేకరిస్తోంది. ఈ పోగ్రామ్ లో రణవీర్ సింగ్ పాల్గొన్నారు. ఓ సంవత్సరం పాటు పదివేల మంది పిల్లలకు మిడ్ డే మీల్స్ కు తన వంతు సాయిం చేసారు.

అంతేకాదు ఇదిగో ఇలా యాడ్ చేసి వారికి బూస్టప్ ఇచ్చి దాతలను ముందుకు రమ్మంటున్నాడు. ఈ వీడియో చూసిన మీకూ ఆసక్తి ఉంటే 750 రూపాయలు డొనేట్ చేసి 'India Ke Hunger Ki Bajao' కార్యక్రమంలో పాల్గొని, మీ వంతు సాయిం చేయండి.

అలాగే ...రణవీర్ సింగ్ ‘డూరెక్స్' కండోమ్ యాడ్లో నటించి సరికొత్త ట్రెండుకు నాంది పలికాడు. రణవీర్ కపూర్ లాంటి స్టార్ హీరో కండోమ్ యాడ్లో నటించగానే...మీడియా ఫోకస్ అంతా అతని వైపు మళ్లింది. అయితే అతను ఏ మాత్రం బెరవకుండా...కండోమ్ వాడకం పెంచడం అంటే మంచి పని చేయడమే, హెచ్ఐవి ఎయిడ్స్, ఇతర సుఖ వ్యాధులు నిరోధించడంలో కండోమ్స్ కీలకం అని ధైర్యంగా చెప్పాడు. రణవీర్ సింగ్ దారిలోనే ఇతర స్టార్స్ నడవాల్సిన అసవరం ఉందనే వాదన వినిపిస్తోంది.

Ranveer Singh at his adorable best in this ad campaign for hungry children

ఇక రణవీర్ కెరీర్ విషయానికి వస్తే ...

టెంపర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తానని ఓ వైపు బండ్లగణేష్... మరోవైపు బాలీవుడ్ లో రీమేక్ చేస్తానని సచిన్ ఉవ్విళ్లూరుతున్నారు... సీక్వెల్ మాటేమోగానీ.. రీమేక్ మాత్రం త్వరగానే పట్టాలెక్కేలా కన్పిస్తోంది... సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్న సచిన్... టెంపర్ బాలీవుడ్ రీమేక్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు... ఈ రీమేక్ మూవీకి హీరో కూడా రెడీగానే ఉన్నాడని సమాచారం.... గూండె, రామ్ లీలా వంటి చిత్రాలలో రఫ్ క్యారెక్టర్స్ తో రఫ్ఫాడించిన రణవీర్ సింగ్.... టెంపర్ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది.

English summary
Bollywood actor Ranveer Singh even shot a video 'India Ke Hunger Ki Bajao' appealing people to voluntarily donate Rs 750 which is an amount equal to a kid's one year's meal. He educates the citizens saying nothing much can be bought with Rs 750 but the same amount could make a difference if used for a good cause.
Please Wait while comments are loading...