గోవాలో పార్టీ: కెమెరాకు చిక్కిన దీపిక, రణవీర్ (ఫోటో)
ముంబై: బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నసంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొట్టిపారేస్తూ వచ్చారు. ఓ వైపు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వీరిద్దరూ గోవాలో పార్టీ చేసుకుంటూ కెమెరాకు చిక్కారు.
'రామ్ లీలా' చిత్రంలో ఈ ఇద్దరి మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారు. అప్పటికే రణబీర్ కపూర్‌కు దూరమైన బాధలో ఉన్న దీపిక ఈ క్రమంలో రణవీర్ సింగ్‌కు దగ్గరయిందని అంటున్నారు. అయితే మీడియా విషయం తెలిస్తే అనవసర రాద్దాంతం చేస్తారనే తమ ఎఫైర్ సీక్రెట్‌గా కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి గోవాలో ఇటీవల ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ పార్టీ మీడియాకు తెలియకుండా సీక్రెట్‌గా జరిగింది. కొందరు స్నేహితుల కారణంగా ఫోటో బయటకు లీకైనట్లు తెలుస్తోంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ....రణబీర్ కపూర్‌తో బ్రేకప్ అయిన తర్వాత చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్ అనేది జీవితంలో ఎంత ముఖ్యమో నాకు తెలుసని చెప్పింది. ఈ క్రమంలో తాను ప్రస్తుతం ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నాననే సంకేతాలు ఇచ్చింది. అయితే అది రణవీర్ సింగా? కాదా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు దీపిక.
ప్రస్తుతం దీపిక పదుకొనె మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు ఫైండింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్, హ్యాపీ న్యూఇయర్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా తన హవా కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications











