»   » ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా దీపిక పదుకొణే ఎంగేజ్ మెంట్: అంత రహస్యం ఎందుకు

ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా దీపిక పదుకొణే ఎంగేజ్ మెంట్: అంత రహస్యం ఎందుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu


బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ దీపిక పదుకోనే రణబీర్ తో పీకలలోతు ప్రేమ లో మునిగిపోయి ఆ ప్రేమకు గుర్తుగా తన శరీరం పై టాటూను కూడ వేయించుకుంది. అయితే అందర్నీ షాక్ కు గురి చేస్తూ ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టింది. దానితో ఆమె హవా తగ్గిపోతుంది అని అనుకున్నారు అంతా. ఇక్కడ కూడ ట్విస్ట్ ఇచ్చింది ఈ బ్యూటీ.

వరుస పెట్టి సూపర్ హిట్స్ అందుకుంటూ బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా మళ్ళీ తన మరొక ప్రేమ కధను బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో మొదలుపెట్టి తన గోల్డెన్ లెగ్ మహత్యంతో ఆ హీరోకు సూపర్ హిట్స్ ఇచ్చి అతని పాలిటి అదృష్ట దేవత అయ్యింది.

ranaveer deepika

వీరిద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఇద్దరి మధ్యా ఉన్న గాఢమైన అనుబంధం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. రిలేషన్ షిప్‌ని ఓపెన్‌గా అంగీకరించకపోయినప్పటికీ తమ చేతల ద్వారా ఎన్నో సార్లు చెప్పకనే చెప్పిందీ జంట. అయితే ఇక ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచటం చాలనుకున్నారేమో పబ్లిక్‌గా లవబుల్ కపుల్స్‌గా తిరుగుతూ.. జస్ట్ ఫ్రెండ్స్ అన్న స్టేటస్‌ను మెయిన్టెయిన్ చేస్తున్న డిప్స్ అండ్ రణ్ వీర్ సీక్రెట్‌గా ఉంగరాలు మార్చేసుకున్నారట.

అయితే పెళ్లి ముచ్చట మాత్రం ఇప్పట్లో లేదట.కొంత కాలంగా దీపిక, రణ్ వీర్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఐఫా వేడుకల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అన్ని రూమర్లకు చెక్ పెట్టేసింది... ఈ నేపథ్యంలో ఇరువురికీ ఎంగేజ్‌మెంట్ అయిందన్న వార్త ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తోంది.

విశేషమేమిటంటే ఈ లవ్లీ కపుల్ ఈ ఏడాది మొదట్లోనే తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగారాలు మార్చేసుకున్నారని బీటౌన్ టాక్. ఇక వీరిరువురు కెరీర్‌ పీక్‌లో ఉండటంతో పెళ్లికి రెండేళ్ల సమయం తీసుకోవాలకున్నారట. బిజీ షెడ్యూల్ నుంచి ఫ్రీ కాగానే మూడు ముళ్ల ముచ్చట కానిచ్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి డిప్స్ రణ్ వీర్ ఇప్పటికైనా తమ అనుబంధంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారేమో చూడాలి.

English summary
If rumours are to be believed, the ‘Ram-Leela’ couple is all set to exchange rings in February 2016. According to B Town Talk “Deepika and Ranveer have got an approval from both the families and are all set to exchange rings and make their relationship official in February 2016.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu