»   » స్టార్ హీరో కండోమ్ యాడ్ చూసారా.... తెగే ఊపేస్తున్నాడు!

స్టార్ హీరో కండోమ్ యాడ్ చూసారా.... తెగే ఊపేస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినిమాల్లో బాగా పేరు వచ్చిన స్టార్స్ వెంట పలు కార్పొరేట్ సంస్థలు పడటం మామూలే. కోట్లు ఆఫర్ చేస్తుండటంతో ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సదరు వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అయితే కండోమ్ యాడ్స్ విషయం వచ్చే సరికి మాత్రం చాలా మంది స్టార్స్ ముందుకు రావడం లేదు. పెద్దగా పేరు లేని క్రింది స్థాయి నటులు మాత్రమే ఇలాంటి యాడ్స్‌కు దిక్కవుతున్నారు.

  అయితే బాలీవుడ్లో మెయిన్ స్ట్రీమ్ యాక్టర్, యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్ 'డూరెక్స్' కండోమ్ యాడ్లో నటించి సరికొత్త ట్రెండుకు నాంది పలికాడు. ఇప్పటికే రణవీర్ నటించిన పలు కండోమ్ యాడ్స్ రిలీజ్ అవ్వగా... తాజాగా మరో యాడ్ రిలీజ్ చేసారు.

  న్యూ కండోమ్ యాడ్ ఇదే

  డూరెక్స్ జీన్స్ పేరుతో రిలీజైన ఈ యాడ్ యువతను ఆకట్టుకుటోంది. జీన్స్ ప్యాంట్ ప్యాకెట్లో కేరీ చేయగలిగేలా కొత్తగా కొండోమ్ ప్యాకెట్లను అందుబాటులోకి తెచ్చారు.

  కండోమ్ యాడ్స్ మంచివే

  కండోమ్ యాడ్స్ మంచివే

  కండోమ్ యాడ్స్ అంటేనే....శృంగార భరితంగా ఉంటాయి. అయితే వాటిని వాడకం పెంచడానికి హాట్ హాట్‌గా వాటిని చిత్రీకరించడం తప్పేమీ కాదనేది సదరు కంపెనీల వాదన. అయితే కండోమ్ వాడకం ఎంత పెరిగితే అంత మంచి జరుగుతుంది సమాజానికి అంటున్నారు. హెచ్.ఐ.వి ఎయిడ్స్, ఇతర సుఖ వ్యాధులు వ్యాపించకుండా ఉండటానికి కండోమ్ వాడకం తప్పని సరి. అవాంచిత గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్‌ను మించిన సురక్షిత మార్గం మరొకటి లేదు.

  ఇతర స్టార్స్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది

  ఇతర స్టార్స్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది

  అయితే కండోమ్ వాడకం పెంచడానికి స్టార్ హీరోలు రంగంలోకి దిగితే ఫలితాలు మరింత బావుంటాయని అంటున్నారు విశ్లేషకులు. దురదృష్ట వశాత్తు మన దేశంలోని స్టార్స్ ఇలాంటివి చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే మన దేశంలో ‘సెక్స్' అనే అంశం ఒక నిశిద్ధ అంశంగానే సాధారణ ప్రజల్లో పరిగణించబడుతోంది. ఎవరూ ‘సెక్స్' గురించి బహిరంగంగా మాట్లాడానికి ఇష్టపడని పరిస్థితులు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. తమ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో కండోమ్ యాడ్స్ చేయడానికి స్టార్ హీరోలు ఇష్ట పడక పోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.

  ‘సెక్స్' పరమైన అంశాల్లో నిశ్శబ్ధాన్ని చేధించాలి

  ‘సెక్స్' పరమైన అంశాల్లో నిశ్శబ్ధాన్ని చేధించాలి

  ‘సెక్స్' పరమైన అంశాల్లో నిశ్శబ్ధాన్ని చేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కండోమ్స్ వాడకం, సురక్షితమైన శృంగారం గురించి ప్రజల్లో అవగాహన పెరిగినపుడే హెచ్ఐవి ఎయిడ్స్, సుఖ వ్యాధులు లాంటిని అరికట్టడానికి వీలవుతుందనేది నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఎయిడ్స్, సుఖవ్యాధులు వ్యాపించడానికి కండోమ్ వాడకం సరిగా లేక పోవడమే అని పలు అధ్యయనాల్లో తేలింది.

  నేను మంచి పనే చేస్తున్నానన్న రణవీర్

  నేను మంచి పనే చేస్తున్నానన్న రణవీర్

  రణవీర్ కపూర్ లాంటి స్టార్ హీరో కండోమ్ యాడ్లో నటించగానే...మీడియా ఫోకస్ అంతా అతని వైపు మళ్లింది. అయితే అతను ఏ మాత్రం బెరవకుండా...కండోమ్ వాడకం పెంచడం అంటే మంచి పని చేయడమే, హెచ్ఐవి ఎయిడ్స్, ఇతర సుఖ వ్యాధులు నిరోధించడంలో కండోమ్స్ కీలకం అని ధైర్యంగా చెప్పాడు. రణవీర్ సింగ్ దారిలోనే ఇతర స్టార్స్ నడవాల్సిన అసవరం ఉందనే వాదన వినిపిస్తోంది.

  English summary
  Durex has become a popular Condom brand in India after Ranveer Singh began endorsing it. Recently, This international firm announced that it's launching 'Durex Jeans' soon. Even Ranveer confirmed the news saying, 'Durex is launching Jeans! Designed for the passionate! Fits well'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more