లవర్స్ కండోమ్స్ వాడాలంటూ యంగ్ హీరో...(వీడియో)
ముంబై: మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కొనసాగుతున్న స్టార్స్ కండోమ్ యాడ్స్ లాంటివి చేయడానికి భయపడుతుంటారు. కానీ బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. 'డూరెక్స్' కండోమ్స్ తరుపున ప్రచారం చేయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుత కాలంలో మొయిన్ స్ట్రీమ్ స్టార్స్ ప్రచారం చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని భావించిన సదరు కంపెనీ రణవీర్‌ను రంగంలోకి దింపడంలో సక్సెస్ అయింది. దీని గురించి రణవీర్ సింగ్ మాట్లాడుతూ..... కండోమ్ యాడ్లో నటించడం అంటే సేఫ్ సెక్స్ గురించి ప్రచారం చేయడమే, దీన్ని ఒక సామాజిక బాధ్యతగా నేను భావిస్తున్నాను అని రణవీర్ సింగ్ తెలిపారు.

రణవీర్ సింగ్ మొదటి నుండి విభిన్నంగా ఆలోచించే వ్యక్తి అని, విభిన్నంగా ముందుకు సాగుతుంటారని, అలాంటి స్వభావం ఉండబట్టే ఆయన కండోమ్ యాడ్లో నటించడానికి ఒప్పుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి చేయడం వల్ల అతని ఇమేజ్‌కు ప్లస్సవుతుందని భావిస్తున్నారు.
కాగా....డూరెక్స్ కంపెనీ రణవీర్ సింగ్‌తో రూపొందించిన కండోమ్ యాడ్ తాజాగా యూట్యూబులో విడుదలైంది. బూతు అంశాలు లేకుండా ఎంతో స్టైలిష్‌గా దీన్ని రూపొందించడంతో ఈ వీడియో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోని అవర్స్ అంతా డూరెక్స్ కండోమ్స్ వాడాలంటూ ఈ యాడ్లో రణవీర్ సింగ్ సూచిస్తున్నాడు. ఇందులో రణవీర్ సింగ్ స్టైలిష్ లుక్ చాలా బాగుందని అంటున్నారు అతని ఫ్యాన్స్.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/T1qEnquUFjw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











