»   » కండోమ్ యాడ్‌లో నటించబోతున్న యంగ్ స్టార్ హీరో

కండోమ్ యాడ్‌లో నటించబోతున్న యంగ్ స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో....ఇప్పుడిప్పుడే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకుంటున్న రణవీర్ సింగ్ త్వరలో కండోమ్ యాడ్లో కనిపించబోతున్నాడు. ప్రముఖ కండోమ్ బ్రాండ్ 'డ్యూరెక్స్' తరుపున రణవీర్ సింగ్ ప్రచారం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రణవీర్ సింగ్ స్వయంగా వెల్లడించారు.

దీని గురించి రణవీర్ మాట్లాడుతూ....'కండోమ్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం అంటే సేఫ్ సెక్స్ గురించి ప్రచారం చేయడమే. ఇప్పటి వరకు చాలా కంపెనీలు నా వెంట పడ్డాయి. కానీ నేను వాటిని తిరస్కరిస్తూ వచ్చాను. అయితే 'డ్యూరెక్స్' లాంటి ప్రపంచ స్థాయి సంస్థ వారు రావడంతో కాదనలేక పోయాను' అని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

Ranveer Singh Endorses For Durex!

కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో రణవీర్ సింగ్ ఇలా కండోమ్ బాండ్ తరుపున ప్రచారం చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ ఈ రూట్లో క్లిక్ అయితే మరికొందరు స్టార్ హీరోలు కూడా ఇదే దారిలో ప్రయాణించే అవకావం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే....2010లో వచ్చిన 'బ్యాండ్ బాజా భారత్' చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన రణవీర్ సింగ్ తొలి సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లేడీస్ అండ్ రికీ బాల్, బాంబే టాకీస్, లూటెరా, రామ్ లీలా, గుండే చిత్రాల్లో నటించాడు. రామ్ లీలా, గుండె చిత్రాలు భారీ విజయం సాధించడంతో రణవీర్ సింగ్ స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రణవీర్ సింగ్ ఫైండింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్, కిల్ దిల్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

English summary
As we brought the news earlier that Ranveer Singh is endorsing a condom brand, we bring the latest news that he is going to endorse for Durex the condom brand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu