డెంగ్యూతో ఆసుపత్రిలో చేరిన యంగ్ హీరో
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ఎంతో ప్రమాదకరమైన డెంగ్యూ ఫీవర్ భారిన పడ్డారు. ప్రస్తుతం ముంబై సబ్‌అర్బన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షూటింగులో ఉండగానే ఆయన తీవ్ర జర్వం రావడంతో ఆసుపత్రికి తరలించి బ్లడ్ టెస్టు చేయగా డెంగ్యూ సోకినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రస్తుతం రణవీర్ సింగ్ హిందీ మూవీ 'గుండే'(Gunday) చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో జరుగుతోంది. ఈ చిత్రంలో రణవీర్‌తో పాటు ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఆ ప్రాంతంలోని దోమకాటు వల్లనే ఈ ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం భారిన పడ్డాడు రణవీర్.
ట్రీట్ మెంట్ తీసుకుంటూనే షూటింగుల్లో పాల్గొనాలని రణవీర్ ఫిక్స్అయ్యాడని సమాచారం. అయితే వైద్యులు మాత్రం అలా చేయడం ప్రమాదకరమని సూచించినట్లు తెలుస్తోంది. రామ్‌లీలా చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే గుండే షూటింగులో జాయినైన రణవీర్ బిజీబిజీగా గడుపుతూనే ఉన్నాడు. రణవీర్ త్వరగా కోలుకుని వీలైనంత త్వరగా షూటింగుల్లో పాల్గొనాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications
