»   » ఫుల్ ఫన్నీ: హృతిక్ కోసం ఇంకో స్టార్ హీరో డబ్‌స్మాష్‌ (వీడియో)

ఫుల్ ఫన్నీ: హృతిక్ కోసం ఇంకో స్టార్ హీరో డబ్‌స్మాష్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇప్పుడు డబ్ స్మాష్ వీడియో అనేది వైరల్ వీడియోలాగ మారింది. ఎక్కడ చూసినా ఆ వీడియోలే. ప్రతీ హీరో, హీరోయిన్స్, సామాన్యుడు అనే తేడా లేకుండా అందరూ ముచ్చట పడుతున్నారు. అదే కోవలో ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ తన సహ నటుడు హృతిక్‌రోషన్‌ కోసం డబ్‌స్మాష్‌ చేశాడు. ఈ వీడియోను రణవీర్‌ ట్విట్టర్‌ ఖాతాలో చూడవచ్చు.

I may never be able to outdo it ... But I can at least try :) only for you Hrithik Roshan cuz I luv ya ! #eyetoeye

Posted by Ranveer Singh on 13 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పాకిస్థాన్‌ సింగర్‌ తహేర్‌ షా పాడిన 'ఐ టూ ఐ' అనే పాటను డబ్‌స్మాష్‌ చేసి రణ్‌వీర్‌ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. రణ్‌వీర్‌ పుట్టిన రోజున అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హృతిక్‌ తన కోసం డబ్‌స్మాష్‌ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఆయన కోరిక మేరకు రణ్‌వీర్‌ డబ్‌స్మాష్‌ చేశాడు.

ఇందులో ఆయన పై నుంచి కింద వరకు తెలుపు దుస్తులు ధరించి, పొడవాటి జుట్టుతో కనిపించాడు. తాను సరిగా చేసుండకపోవచ్చునని.. కాకపోతే తాను కనీసం ప్రయత్నించానని ఆయన అన్నారు. తనకు హృతిక్‌ అంటే ఇష్టమని, అందుకే ఆయన కోసం చేశానని రణ్‌వీర్‌ పేర్కొన్నారు.

English summary
Ranveer Singh Just Made The Most HILARIOUS Dubsmash For Hrithik Roshan - And We Can't Stop Laughing
Please Wait while comments are loading...