అఫీషియల్: 1983 క్రికెట్ వరల్డ్ కప్‌పై సినిమా, కపిల్ దేవ్ పాత్రలో....

1983 క్రికెట్ వరల్డ్ కప్‌పై సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్ర రణవీర్ సింగ్ చేస్తున్నారు.

By Bojja Kumar

ఇండియన్ క్రికెట్ స్టార్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని జీవితం ఆధారంగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికంటే ముందే ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో సంచలనాలు క్రియేట్ చేసి 1983లో ఇండియాకు తొలి వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన క్రికెట్ స్టార్ కపిల్ దేవ్. త్వరలో కపిల్ జీవితంపై సినిమా రాబోతోంది.

1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కపిల్ దేవ్‌ను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉండబోతోంది. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ గా ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించబోతున్నారు. ఇందుకోసం రణవీర్ సింగ్ కపిల్ స్టైల్ బౌలింగ్, బ్యాటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు.

ముందు అనుకున్నది వేరు..

ముందు అనుకున్నది వేరు..

ఈ సినిమా చేద్దామని అనుకున్నపుడు ముందుగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ను హీరోగా అనుకున్నారట. ఏమైందో తెలియదు కానీ తర్వాత నిర్ణయం మారిందని, రణవీర్ సింగ్ ను ఫైనల్ చేస్తూ ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కబీర్ ఖాన్

కబీర్ ఖాన్

ఈ సినిమా గురించి ఓ ఆంగ్లపత్రికతో కబీర్ ఖాన్ మాట్లాడుతూ... నా కెరీర్లోనే మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అని, ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

అతడే ఫస్ట్ చాయిస్

అతడే ఫస్ట్ చాయిస్

రణవీర్ సింగ్‌ అయితేనే కపిల్ దేవ్ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. ఈ సినిమా ఆలోచన రాగానే రణవీర్ సింగ్ తో చేయాలని డిసైడ్ అయ్యాడని, అతడే తన ఫస్ట్ చాయిస్ అని కబీర్ ఖాన్ తెలిపారు.

పెర్ఫెక్ట్ ఫిట్

పెర్ఫెక్ట్ ఫిట్

పాంటమ్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విష్ణువర్దన్ ఇందూరి మాట్లాడుతూ... ‘ఇండియన్ క్రికెట్ లెజెండ్స్‌లో కపిల్ దేవ్ ఒకరు. ఆయన పాత్రకు రణవీర్ సింగ్ అయితేనే పర్ఫెక్టుగా సరిపోతారు, అతడి ఎనర్జీ, పాషన్ సినిమాకు బాగా ప్లస్సవుతుంది' అని తెలిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X