RC 15: లాంచ్ వేడుకకు రెండు పిలకలతో వచ్చిన హీరో.. చూసి నవ్వు ఆపుకోలేకపోయిన రాజమౌళి!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని దర్శకుడు శంకర్ చాలా బలంగా ప్రిపేర్ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక టాలీవుడ్ హీరోతో వర్క్ చేస్తుండడంతో అంచనాలు కూడా గట్టిగానే పెరిగాయి.

అయితే ఈ సినిమాకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఒక హీరోతో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి నవ్వేశాడు. ఎదురుగా ఉన్న రామ్ చరణ్ తేజ్ కూడా అలాగే పగలబడి నవ్వేసినట్లు ఉంది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా..

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా..

రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో పాన్ ఇండియ ప్రపంచ లోకి లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం రాబోయే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్టుగా ఉండాలని రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టు ను లైన్ లోకి తెచ్చాడు.

ప్రత్యేకమైన అతిథులుగా..

ప్రత్యేకమైన అతిథులుగా..

ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంచ్ వేడుకలు నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా నిర్వహించారు. వేడుకకి దర్శకుడు రాజమౌళి తో పాటు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా మొదటి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో స్టార్స్ అందరూ కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

అయితే ఒక ఫోటో లో దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ యువ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండు విభిన్నమైన పోనీ టైల్స్ తో రావడం విశేషం. ఇక కొంతమంది వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా మీమ్స్ తయారు చేస్తున్నారు. రెండు పిలకలను చూసి దర్శకుడు రాజమౌళి నవ్వుతున్నట్లు గా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలా మంది హీరోలు పోనీ టైల్స్ ను ఫాలో అయ్యారు కానీ రణ్ వీర్ మాత్రం రెండు విభిన్నమైన వాటిని సెట్ చేసుకోవడం విశేషం.

అందుకే రామ్ చరణ్ కోసం..

అందుకే రామ్ చరణ్ కోసం..

ఇక రణ్ వీర్ సింగ్ ఈ సినిమా లాంచ్ వేడుకకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. దర్శకుడు శంకర్ అపరిచితుడు సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రణ్ వీర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సినిమా అనంతరం దర్శకుడు శంకర్ ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక మంచి సాన్నిహిత్యం ఉండటం వల్లనే రణ్ వీర్ సింగ్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.

Recommended Video

Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మొట్టమొదటి సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ లోపు ఫినిష్ చేయాలని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక సినిమాను 2023 జనవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత దర్శకుడు శంకర్ అపరిచితుడు సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక అదే ఏడాది దీపావళికి విడుదల చేయాలని మరొక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. మరి ఈ ప్రణాళికలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X