»   » ఫ్రెండ్ పెళ్లిలో రెచ్చిపోయి..హీరో డాన్స్ (వీడియో)

ఫ్రెండ్ పెళ్లిలో రెచ్చిపోయి..హీరో డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: స్నేహానికి ప్రాణం ఇచ్చే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్... ఎనర్జీ కూడా ఓ రేంజిలో ఉంటుంది. రీసెంట్ గా తన స్నేహితుడు పెళ్లికి వెళ్లి అక్కడ క్రేజీ గా డాన్స్ చేసాడు. అతని ఫ్యాన్ క్లబ్ వాళ్లు ఈ వీడియోని పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మీడియాలో అభిమానులను అలరిస్తోంది.

రణవీర్ సింగ్ తాజా చిత్రం విషయానికి వస్తే... రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన పీరియాడిక్ విజువల్ వండర్ 'బాజీరావ్ మస్తానీ'. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ప్రేమకథ బాలీవుడ్లో కాసుల పంట పండిస్తోంది. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

డిసెంబర్ 18న రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా 'బాజీరావ్ మస్తానీ' సినిమాను చూశారు.

16 శతాబ్దానికి చెందిన విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిభకు ముగ్దుడైన అఖిలేష్, ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్ లో వినోద పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోను సత్తా చాటిన బాజీరావ్ మస్తానీ 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

English summary
Ranveer Singh's energetic side is hidden to none. Just now, we got our hands on a hilarious video clip of Ranveer Singh, in which he can be seen dancing like crazy at his friend's wedding. The video is being posted by one of his fanclubs on Twitter and it is going viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu