మహేశ్, నమత్ర రహస్య పర్యటన గుట్టు వీడింది.. రణ్‌వీర్ సింగ్‌తో క్రేజీ ప్రాజెక్ట్
Recommended Video

ఒకప్పుడు ఇది దక్షిణాది చిత్ర పరిశ్రమ.. అది ఉత్తరాది చిత్ర పరిశ్రమ అనే బేధాలుండేవి. ఇప్పడు రోజులు మారిపోయాయి. టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్‌లో.. అక్కడి వాళ్లు తెలుగు సినిమాల్లో నటించడానికి పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఎలాంటి ఇగోలు లేకుండా ఎలాంటి ప్రాజెక్ట్‌లోనైనా నటించడానికి ముందుకొస్తున్నారు. ప్రిన్స్ మహేశ్‌బాబు, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కలయికే అందుకు ఉదాహరణ. దాంతో ముంబైలో నమత్ర, మహేశ్‌బాబు తాజా పర్యటనపై అసలైన క్లారిటీ వచ్చింది.

థమ్స్ ఆప్ యాడ్‌లో
ప్రిన్స్ మహేశ్ థమ్స్ ఆప్ వ్యాపార ప్రకటనకు ఎప్పటి నుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారు. ఉత్తరాదిలో గతంలో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు. కానీ తాజాగా రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. వీరిద్దరూ కలిసి థమ్స్ ఆప్ వ్యాపార ప్రకటనలో నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది.

కాలిఫోర్నియాలో షూటింగ్
థమ్స్ ఆప్ యాడ్‌ను ప్రస్తుతం మహేశ్ బాబు, రణ్‌వీర్‌పై కాలిఫోర్నియాలో షూట్ చేస్తున్నారు. ఈ మధ్యనే మహేశ్, నమత్ర యూఎస్‌కు వెళ్లే క్రమంలో ముంబైలో ఆగారు. ఆ సమయంలో వారిద్దరూ మీడియా కంటపడ్డారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో నమత్ర శిరోద్కర్
మహేశ్‌బాబు, రణ్‌వీర్ సింగ్ కలిసి నటిస్తున్న కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోను ప్రిన్స్ సతీమణి నమత్ర శిరోద్కర్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతా రంగుల మయం.. థమ్స్‌అప్ చార్జ్‌డ్ అని ఓ క్యాప్సన్ పోస్ట్ చేశారు.

యాడ్ కోసం కొత్తలుక్‌లో
వ్యాపార ప్రకటన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దస్తులను ధరించిన మహేశ్, రణ్‌వీర్ ఫోటోకు ఫొజిచ్చారు. మధ్యలో ఉన్న వ్యక్తి యాడ్‌కు డైరెక్షన్ వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

కొరటాల శివ డైరెక్షన్‌లో
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహించే భరత్ అను నేను అనే చిత్రంలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ విడుదలకు సిద్ధమవుతున్నది. ఆ తర్వాత వంశీపైడిపెల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మహేశ్ నటిస్తారు.

పద్మావతి చిత్రంలో
ఇక వివాదాస్పద చిత్రం పద్మావతిలో రణ్‌వీర్ సింగ్ ఖిల్జీ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వాస్తవానికి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











