ఆ వ్యాపారం చేసి నష్టపోయిన యాక్టర్ రావు రమేష్.. ఎంత కష్టపడినా రూపాయి కూడా రాలేదట!
వ్యవసాయం అందరికి చేయాలని ఉంటుంది. కానీ అది అంత ఈజీ కాదని రావు రమేష్ రమేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. శ్రీకారం సినిమాలో కేశవులు అనే పాత్రలో నటించిన రావు రమేష్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటు తన నిజ జీవితానికి సంబంధించిన అనేక రకాల విషయాలని చెబుతున్నారు. ఒకసారి అత్యదిక లాభాలు వస్తాయని వ్యవసాయం చేశారట. కానీ ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా రాలేదని చెప్పారు.

శ్రీకారం ప్రమోషన్ లో
శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాని కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించాడు.
ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు వ్యవసాయానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేసుకుంటున్నారు.

మళ్ళీ దశాబ్ద కాలం తరువాత
ఇక సినిమాలో హీరో తండ్రిగా కేశవులు అనే పాత్రలో నటించారు సీనియర్ నటుడు రావు రమేష్. విభిన్నమైమ పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆయన శర్వానంద్ తో మళ్ళీ దశాబ్ద కాలం తరువాత నటించారు. వీరి కాంబినేషన్ లో అప్పట్లో గమ్యం సినిమా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

800మొక్కలు నాటిన శర్వానంద్
శ్రీకారం సినిమాకు సంబంధించిన సినిమా ప్రమోషన్ లో రావ్ రమేష్, శర్వానంద్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో శర్వానంద్ తన ఫామ్ హౌజ్ లోని వ్యవసాయం గురించి చెప్పాడు. లాక్ డౌన్ లో దాదాపు మూడు నెలలు ఎలాంటి వసతులు లేకుండా అక్కడే ఉన్నట్లు చెబుతూ 800కు పైగా మొక్కలు నాటినట్లు వివరణ ఇచ్చారు.

అట్టర్ ప్లాప్ అయ్యాను: రావు రమేష్
ఇక రావు రమేష్ నటుడిగా ఇంకా బిజీ కానీ సమయంలో ఒక వ్యవసాయం చేసినట్లు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. నిజ జీవితంలో నేను రైతుగా కొన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఆ విషయంలో ఎంత కష్టపడినా కూడా అట్టర్ ప్లాప్ అయ్యాను. చివరికి చేతుల్లోకి రూపాయి కూడా రాలేదు.. అంటూ అగ్రకల్చర్ స్టోరీని చెప్పుకొచ్చారు.

భారీ స్థాయిలో లాభాలు ఉంటాయని..
1995లో మద్రాసులో ఉన్నప్పుడు ఇంటి దగ్గరే వ్యవసాయం చేసి లాభాలు అందుకోవాలని అనుకున్నాను. ఒక న్యూస్ పేపర్ లో పుట్టగొడుగుల వ్యాపారం గురించి చదివాను. ఆ టైమ్ లో ఆ వ్యాపారం చేస్తే భారీ స్థాయిలో లాభాలు ఉంటాయని చెప్పారు. ఎలాంటి పని లేదు కాబట్టి పుట్టగొడుగుల వ్యాపారం తొందరగానే స్టార్ట్ చేశాను.. అని చెప్పారు.

రూపాయి కూడా చేతికి రాలేదు
అయితే పుట్టగొడుగుల వ్యాపారం చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఓపిక కూడా ఉండాలి. ఆ పని చేసిన తరువాతఆ విషయం తెలిసింది. అది తప్ప ఇంకేదైనా చేయవచ్చు అని అనుకున్నాను. ఫైనల్ గా ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు.. అను రావు రామేష్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











