ఈ జనరేషన్ లో ఎవరు చేయలేని పాత్రలో రావ్ రమేష్.. ఆ మల్టీస్టారర్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావ్ రామేష్ ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా విభిన్నంగా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెగిటివ్, పాజిటివ్, కామెడీ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను టచ్ చేస్తున్న ఆయన బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఇక ఇప్పుడు మొదటిసారి ఈ జనరేషన్ లో ఎవరు టచ్ చేయని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో అంగ వైకల్యం ఉన్న పాత్రలను చేయడానికి నటీనటులు పోటీగా కష్టపడి నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే లోపాలతో ఉన్న పాత్రలను చేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇక అల.. వైకుంఠపురములో మురలిశర్మ కూడా కాలు అవిటిగా ఉన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

గతంలో ఎప్పుడు లేని విధంగా రావ్ రమేష్ ఒక గూని వాడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. సిద్దార్థ్, శర్వానంద్ నటిస్తున్న మహాసముద్రం. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న గూని వాడి పాత్రలో నటిస్తున్నారట. సినిమాలో ప్రతి పాత్రకు కూడా యాక్టింగ్ కు స్కోప్ ఉండేలా దర్శకుడు అజయ్ భూపతి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ కూడా నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడని సమాచారం. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











