twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘యాత్ర’లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్

    |

    మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర' ఫిబ్రవరి 8న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    ఈ చిత్రంలో వైఎస్ఆర్ స్నేహితుడు కెవిపి పాత్ర పోషించిన రావు రమేష్ మాట్లాడుతూ... ఒక మహా నాయకుడి సినిమా తీస్తున్నపుడు అన్ని విషయాలు చెప్పడానికి కుదరదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూలు టచ్ చేయడానికి ఉండదు. వీటిని సమన్వయం చేస్తూ దర్శకుడు మహి వి రాఘవ్ అద్భుతంగా సినిమా తీశారని తెలిపారు.

    ఇది డబ్బు కోసం తీసిన సినిమా కాదు

    ఇది డబ్బు కోసం తీసిన సినిమా కాదు

    రాజకీయాల గురించి రకరకాలగా వింటుంటాం. కొన్ని చెడుగా చెబుతారు. ‘యాత్ర' సినిమా చూస్తుంటే భయం వేసింది, గౌరవం పెరిగింది. ఇది డబ్బు కోసం తీసిన సినిమా కాదు. సోల్ టచ్ చేసిన సినిమా... అని రావు రమేష్ తెలిపారు.

    మనం ఎక్కడ బ్రతుకుతున్నామనే సిగ్గేసింది

    మనం ఎక్కడ బ్రతుకుతున్నామనే సిగ్గేసింది

    వైఎస్ఆర్ పాద యాత్ర చేసినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా హాస్పటల్ సీన్లు, రైతుల గురించిన సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. ప్రజలు కష్టాలు చెప్పుకునే సంఘటనలు చూసినపుడు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నామనే సిగ్గేసింది.

    మమ్ముట్టి జీవించారు

    మమ్ముట్టి జీవించారు

    మమ్ముట్టి బాగా నటించారు అనడం కన్నా జీవించారు అనాలి. ఆయన ఆరా స్క్రీన్ మీద కనపడింది. రాజశేఖర్ రెడ్డిగారి లాంటి ఒక పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. తెలుగు నేర్చుకుని, ప్రతీ సీన్ ఆయన తన భుజాలపై మోశారు. ఈ వయసులో కూడా ఆయన అంత స్ట్రెస్ తీసుకుని ప్రతి సీన్ క్యారీ చారు.

    ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది

    ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది

    మహి వి రాఘవ్ తీసిన విధానం చాలా బావుంది. కష్టాలు మనం వింటుంటాం. ఆత్మహత్యలు చూసుకుంటాం. పేపర్లో చూసి చూసి ఇన్‌సెన్సిటివ్ అయిపోయాం. ఆరోగ్య శ్రీ,, రైతుల కష్టాలు చూసినపుడు చాలా మెషనల్ అయ్యాను. సినిమా ఇది ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఈ చిత్రంలో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్.. అని రావు రమేష్ వ్యాఖ్యానించారు.

    English summary
    Rao Ramesh Emotional Words about Yatra Movie and Mammootty. Yatra is biographical film, based on life of Y. S. Rajasekhara Reddy, who served as Chief Minister of Andhra Pradesh from 2004 to June 2009 representing Indian National Congress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X