రావు రమేష్ కుటుంబంలో విషాదం.. సినీ ప్రముఖుల సంతాపం..
Recommended Video

ప్రముఖ నటుడు రావు రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. ఆయన తల్లి కమలకుమారి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు, దివంగత రావు గోపాలరావుకు కమలకుమారి సతీమణి అనే విషయం అందరికి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల చివరి చూపు కోసం కమలకుమారి భౌతికదేహాన్ని హైదరాబాద్ కొండాపూర్‌లోని రావు రమేష్ నివాసంలో ఉంచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అనారోగ్యంతో బాధపడుతూ
గత కొద్దిరోజులుగా కమలకుమారి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసినట్టు సినీవర్గాలు తెలిపాయి. కమలకుమారి అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించే అవకాశం ఉంది.

గొప్ప హరికథా కళాకారిణి
కమలాకుమారి వయసు 75 సంవత్సరాలు. ఆమె గొప్ప హరికథ కళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర ప్రాంతాల్లో దాదాపు 5000 ప్రదర్శనలు ఇచ్చారు.

రావుగోపాలరావుతో వివాహం
రావుగోపాలరావు, కమలకుమారి వివాహం చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో జరిగింది. ఓ హరికథా కార్యక్రమంలో కమలాకుమారి ప్రదర్శనకు ముగ్ధుడైన రావుగోపాల్‌రావు ఆమెను ప్రేమవివాహం చేసుకున్నారు. రావుగోపాల్‌రావు కుమారుడు రావు రమేశ్ ప్రసుత్తం నటుడిగా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.

రావు రమేష్‌కు పలువురి సంతాపం
మాతృవియోగంతో బాధపడుతున్న రావు రమేష్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రావు రమేష్ నివాసానికి వెళ్లి కమలకుమారికి పలువురు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











