'యువరాజ్యం' నిర్మాతపై రేప్ ఫిర్యాదు

By Santaram

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'యువరాజ్యం' చిత్ర నిర్మాత తనపై అత్యాచార యత్నం, హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ ఓ యువతి విశ్వ హిందూ పరిషత్ ను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఆసర నిర్మాణ్‌ ఇండియా అనే ఫిలిం సంస్థలో కో-ఆర్డినేటర్‌-కమ్‌-రిసెప్షనిస్టుగా ఓ యువతి (19) ఉద్యోగంలో చేరింది. ఆ సంస్థ యజమాని హరాన్‌ హుస్సేన్‌ సయ్యద్‌... యువరాజ్యం చిత్రానికి నిర్మాత. గురువారం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ ఉన్నందున సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేందుకు బుధవారం ఆ యువతిని తన వెంట సయ్యద్‌ తీసుకెళ్ళాడు.

రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి భోజనానికని తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆమె వివరించింది. ఆడియో రిలీజ్‌ పంక్షన్‌ ఉందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడని, ఒకవేళ ఎవరికైనా చెబితే ఎన్ని కోట్లైనా ఖర్చుపెట్టి తనను చంపుతానని బెదిరించినట్టు ఆమె తెలిపింది. కాగా, సినీ నిర్మాతను శిక్షించేంత వరకు తాము అండగా నిలబడతామని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకారపు కేశవరాజు, భజరంగ్‌దళ్‌ నగర అధ్యక్షులు టి.ఎన్‌.మురారి, వంశీసింగ్‌లు భరోసా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X