twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్ రేప్ సీన్ ఎన్టీఆర్ కొత్త చిత్రంలో...

    By Srikanya
    |

    హైదరాబాద్ : సమాజంలో చర్చనీయాంసం మారిన విషయాలు,సంఘటనలు సినిమాల్లో చోటు చేసుకోవటం మామూలే. ఇదే కోవలం ఎన్టీఆర్ తాజా చిత్రంలో డిల్లీ గ్యాంగ్ రేప్ కి చెందిన సన్నివేశం ఒకటి ఉండబోతోందని సమాచారం. ఈ మేరకు హరీష్ శంకర్ స్క్రిప్టులో సీన్ చేర్చాడని, ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేట్ అవటమే కాక, గ్యాంగ్ రేప్ విషయమై ఆలోచనలు రేకిత్తించేలా డైలాగులు రెడీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు సినిమాలో వస్తే వెంటనే చూసేవారు కనెక్టు అవతూంటారు.

    ప్రస్తుతం హరీష్ శంకర్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో బిజీగా ఉన్నారు. చిత్రం షూటింగ్ డిటైల్స్ ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు...ఆయన ట్వీట్ లో ...యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మా సినిమా షూటింగ్ ప్రారంభించడానికి డేట్స్ ఇచ్చారు. జనవరి 3 నుంచి 15 వరకు తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. మేము అంతా సిద్దంగా ఉన్నాం. ఎనర్జిటిక్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడానికి మా టీం అంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది' అంటూ... హరీష్ శంకర్ తన ట్విట్టర్లో ప్రకటించారు. 'మై బ్రదర్ శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేష్‌లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సినిమా (బాద్ షా) షెడ్యూల్స్ పూర్తికాక ముందే మా సినిమాకు యంగ్ టైగర్ డేట్స్ ఇచ్చేలా సహకరించినందుకు థాంక్స్' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

    ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    
 According to sources, it is heard that director Harish Shankar is planning to include the gang rape incident which happened in Delhi kind of scene in his new film with Junior NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X